China vs India: భారత క్రీడాకారులకు చైనా అనుమతి నిరాకరణ.. పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి
ABN, First Publish Date - 2023-09-22T16:20:34+05:30
భారత(India) సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలను నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఇండియాతో ఏదో ఒక చోట గొడవ పడాలని చూసే దాయాది దేశం చైనా(China) తాజా నిర్ణయం మరో సారి చర్చనీయాంశం అయింది. మన దేశ అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) క్రీడాకారులకు చైనా వీసా(Visa) నిరాకరించింది.
అరుణాచల్ ప్రదేశ్: భారత(India) సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలను నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఇండియాతో ఏదో ఒక చోట గొడవ పడాలని చూసే దాయాది దేశం చైనా(China) తాజా నిర్ణయం మరో సారి చర్చనీయాంశం అయింది. మన దేశ అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) క్రీడాకారులకు చైనా వీసా(Visa) నిరాకరించింది. ఆసియా క్రీడల్లో వారు పాల్గొనకుండా అడ్డుకుంది. ఈ నిర్ణయంపై భారత్ మండిపడింది. ప్రతిగా చైనాలోని హాంగ్ జౌలో శనివారం జరగనున్న ఆసియా గేమ్స్(Asia Games) వేడుకల్లో పాల్గొనకూడదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నిర్ణయించుకుని.. చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ ఇదే విషయాన్ని మీడియాకు తెలిపారు. ఆసియా క్రీడలకు ప్రవేశాన్ని నిరాకరించడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులపై చైనా అధికారులు వివక్ష చూపారని ఆరోపించారు. అదే సమయంలో అరుణాచల్ భూభాగంపై వితండ వాదనలు చేస్తున్న చైనా దుర్భుద్దిని గమనించిన భారత్ ఆ రాష్ట్రం భారత్ అంతర్భాగమని స్పష్టం చేసింది. ప్రాంతం, జాతి ఆధారంగా చైనా వివక్ష చూపుతోందని ఆరోపించింది. ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయంతోపాటు, బీజింగ్‌లో కూడా ఈ నిర్ణయింపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది.
Updated Date - 2023-09-22T17:07:03+05:30 IST