370 రద్దు అవసరమా
ABN, First Publish Date - 2023-08-31T02:17:41+05:30
గత 69 ఏళ్లుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన అనేక తీర్పులు భారత రాజ్యాంగాన్ని చాలావరకు జమ్మూ కశ్మీరుకు వర్తించేట్లు చేశాయని
ఇప్పటికే కశ్మీరు భారత్‌లో అంతర్భాగమైంది: సుప్రీం
కశ్మీరు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం: కేంద్రం
న్యూఢిల్లీ, ఆగస్టు 30: గత 69 ఏళ్లుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన అనేక తీర్పులు భారత రాజ్యాంగాన్ని చాలావరకు జమ్మూ కశ్మీరుకు వర్తించేట్లు చేశాయని, తద్వారా అది భారతదేశంలో అంతర్భాగంగా మారిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ను ప్రత్యేకంగా రద్దు చేయాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించింది. ఈ అంశంపై బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి. ఆర్టికల్ 370 రద్దుకు జమ్మూ కశ్మీరు రాజ్యాంగ శాసనసభ ఆమోదం అవసరమా? అన్న అంశంపైనే ప్రధానంగా వాదనలు సాగాయి. రాజ్యాంగ శాసనసభ సిఫార్సు అవసరమే కానీ, దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ చెప్పారు. ఒక రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చగలదా? మార్చాలంటే దాన్ని విభజించాలా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం కుదరదని, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్ట వచ్చని అటార్నీ జనరల్ వివరించారు. జమ్మూ కశ్మీరు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తారా? అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించగా, తప్పకుండా పునరుద్ధరిస్తామని అటార్నీ జనరల్ ప్రకటించారు.
Updated Date - 2023-08-31T02:17:41+05:30 IST