ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Aditya-L1 Mission: ఆదిత్య-ఎల్1 మిషన్‌పై ఇస్రో కీలక అప్డేట్.. ఆ ప్రాజెక్ట్ తర్వాత ఇది రెండోసారి

ABN, First Publish Date - 2023-09-30T22:22:54+05:30

చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతమైన ఆనందంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదిత్య-ఎల్1 సోలార్ మిషన్‌ని ప్రారంభించింది. సెప్టెంబర్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీఫ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి...

చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతమైన ఆనందంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదిత్య-ఎల్1 సోలార్ మిషన్‌ని ప్రారంభించింది. సెప్టెంబర్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీఫ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేసింది. ప్రస్తుతం తన గమ్యస్థానమైన లాగ్రాంజ్ పాయింట్ (ఎల్1) దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఆదిత్య-ఎల్1 వ్యోమనౌక భూ ప్రభావ గోళాన్ని విజయవంతంగా విడిచిపెట్టి.. 9.2 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించిందని ఇస్రో శనివారం ట్వీట్ చేసింది. ‘‘ఆదిత్య-ఎల్1 మిషన్ భూ ప్రభావ గోళాన్ని విజయవంతంగా దాటేసి 9.2 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఇప్పుడు ఇది లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్1) దిశగా తన మార్గాన్ని నావిగేట్ చేస్తోంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ తర్వాత భూమి ప్రభావ గోళం వెలుపల ఓ అంతరిక్ష నౌకను ఇస్రో పంపడం ఇది రెండోసారి’’ అంటూ ట్విటర్ (X ప్లాట్‌పార్మ్) మాధ్యమంగా తెలిపింది.


ఇదిలావుండగా.. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి సోలార్ మిషన్ ఇది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ వద్ద ఉన్న దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ఈ ఆదిత్య-ఎల్1 చేరాలి. అందుకు నాలుగు నెలల సమయం పడుతుంది. ఈ శాటిలైట్‌లో మొత్తం 7 పేలోడ్స్ ఉన్నాయి. మొత్తం నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తే.. మిగతా మూడు పేలోడ్స్ సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.

ఇంతకీ లాగ్రాంజ్ పాయింట్ అంటే ఏమిటి? రెండు పెద్ద వస్తువుల గురుత్వాకర్షణ శక్తి.. ఆ రెండింటి మధ్య ఒక చిన్న వస్తువుని బంధించడాన్నే లాగ్రాంజ్ పాయింట్ 1 లొకేషన్ అని అంటారు. భూమి, సూర్యుని మధ్య మొత్తం ఐదు లాగ్రాంజ్ పాయింట్లు (L1 - L5) ఉన్నాయి. అయితే.. వీటిలో లాగ్రాంజ్ పాయింట్ 1 అనేది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే.. ఇక్కడ నుండి ఎలాంటి సమస్య లేకుండా సూర్యుడ్ని పర్యవేక్షించవచ్చు.

Updated Date - 2023-09-30T22:22:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising