ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3 : చంద్రునిపై ల్యాండింగ్‌కు కొద్ది గంటల ముందు ఇస్రో కీలక ప్రకటన

ABN, First Publish Date - 2023-08-23T13:42:23+05:30

భారతీయుల కలలను సాకారం చేస్తూ చంద్రయాన్-3 దూసుకెళ్తోంది. భారత దేశాన్ని ప్రపంచంలో సమున్నత స్థానంలో నిలపబోతోంది. అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శాస్త్రవేత్తల శ్రమకు ఫలితం రాబోతోంది. అంతా సవ్యంగానే జరుగుతోంది.

న్యూఢిల్లీ : భారతీయుల కలలను సాకారం చేస్తూ చంద్రయాన్-3 దూసుకెళ్తోంది. భారత దేశాన్ని ప్రపంచంలో సమున్నత స్థానంలో నిలపబోతోంది. అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శాస్త్రవేత్తల శ్రమకు ఫలితం రాబోతోంది. అంతా సవ్యంగానే జరుగుతోంది. అందరి పూజలకు ఫలితం వస్తోంది. అనుకున్నట్లుగానే బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రునిపై భారత దేశ జాతీయ పతాకం రెపరెపలాడబోతోంది.

ఇస్రో బుధవారం మధ్యాహ్నం 12.52 గంటలకు ఇచ్చిన ట్వీట్‌లో, చంద్రయాన్-3 కార్యక్రమంలో ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ (ALS)ను ప్రారంభించడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ నిర్ణీత ప్రదేశం వద్దకు రావడం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. ఇది బుధవారం సాయంత్రం 5.44 గంటలకు ఆ ప్రదేశానికి చేరుకుంటుందని తెలిపింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ ఏఎల్ఎస్ కమాండ్‌ను స్వీకరించిన మీదట వేగాన్ని సర్దుబాటు చేయగలిగేవిధంగా ఇంజిన్లను పని చేయిస్తాయని, తద్వారా ల్యాండర్ సక్రమంగా దిగడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపింది. బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో దీని ప్రత్యక్ష ప్రసారం బుధవారం సాయంత్రం 5.20 గంటల నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది.


ఇవి కూడా చదవండి :

Chandrayaan-3 : చంద్రునిపై భారత్ జయకేతనం ఎగురవేయాలంటూ కోట్లాది మంది పూజలు

Chandrayaan-3 : గతంలో ఇస్రోను ఎగతాళి చేసిన పాకిస్థానీ నేత, ఇప్పుడు ఏమంటున్నారంటే..

Updated Date - 2023-08-23T13:50:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising