ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: మరో వీడియో షేర్ చేసిన ఇస్రో.. ల్యాండర్ నుంచి రోవర్ ఎలా దిగిందో మీరూ చూసేయండి..

ABN, First Publish Date - 2023-08-25T11:34:33+05:30

చంద్రయాన్-3 మిషన్‌లో (Chandrayaan-3 mission) భాగంగా చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) విజయవంతంగా ల్యాండింగ్ అయిన నాటి నుంచి ఏదో ఒక ఆసక్తికర సమాచారాన్ని పంచుకుంటున్న ఇస్రో శుక్రవారం మరో ఆసక్తికర వీడియోను షేర్ చేసింది.

బెంగళూరు: చంద్రయాన్-3 మిషన్‌లో (Chandrayaan-3 mission) భాగంగా చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) విజయవంతంగా ల్యాండింగ్ అయిన నాటి నుంచి ఏదో ఒక ఆసక్తికర సమాచారాన్ని పంచుకుంటున్న ఇస్రో శుక్రవారం మరో ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ వడివడిగా చంద్రుడి ఉపరితలం మీద అడుగుపెడుతున్న దృశ్యాలను పంచుకుంది. ఈ మేరకు ఎక్స్‌లో (ట్విటర్) ఒక ఆసక్తికర వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోను ల్యాండర్ విక్రమ్‌లోని కెమెరా బంధించింది. ‘‘ చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండర్ నుంచి రోవర్ కిందికి ఇలా దిగింది’’ అని ఇస్రో క్యాప్షన్ ఇచ్చింది.


రోవర్‌ తన పని బాగా చేస్తోంది

చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన రోవర్ ప్రజ్ఞాన్ తన పని బాగా చేస్తోందని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ గురువారం తెలిపారు. ‘‘అనుకున్న ప్రదేశంలోనే ల్యాండర్‌ ల్యాండ్‌ అయింది. ల్యాండింగ్‌ లొకేషన్‌, కేంద్రాన్ని గుర్తించాం. గురువారం తెల్లవారు జామున ల్యాండర్‌ నుంచి (ప్రజ్ఞాన్‌) రోవర్‌ వేరు పడింది. రోవర్‌ తన అన్వేషణను మొదలుపెట్టింది. అది బాగా పని చేస్తోంది. చంద్రుడిపై ఉన్న ఖనిజాలు, వాతావరణం, భూకంప కార్యకలాపాలపై ప్రాథమికంగా అధ్యయనం చేస్తుంది’’ అని తెలిపారు.


ఇస్రో కేంద్రానికి ప్రధాని మోదీ

చంద్రయాన్‌-3ను విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను అభినందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు వెళ్లనున్నారని సమాచారం. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని శనివారం ఉదయం 5.55 గంటలకు హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కిలోమీటరు మేర రోడ్‌షోలో పాల్గొంటారు. ఉదయం 7 గంటలకు పీణ్యాలోని ఇస్రో కేంద్రానికి చేరుకుంటారు. చంద్రయాన్‌ మిషన్‌లో భాగస్వాములైన శాస్త్రవేత్తలందరినీ స్వయంగా కలిసి అభినందించనున్నారు. శాస్త్రవేత్తల అనుభవాలను తెలుసుకోనున్నారు.

Updated Date - 2023-08-25T12:10:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising