ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

George Sorrows : ఇక మోదీ వీక్‌

ABN, First Publish Date - 2023-02-18T02:31:55+05:30

హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ వ్యాపార సామ్రాజ్యంలో ప్రకంపనలు పుట్టి, షేర్‌ మార్కెట్లు అతలాకుతలమై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు పెను సవాలుగా నిలిచింది. ఈ తరుణంలో యూర్‌పకు చెందిన బడా పెట్టుబడిదారు జార్జి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వం మీద పట్టు తప్పడం ఖాయం

ఆయన భవిత అదానీతో ముడిపడింది

అదానీ దెబ్బ తినడంతో ఈయనకీ కష్టాలే

భారత్‌లో మళ్లీ ప్రజాస్వామ్యం వస్తుంది

పెట్టుబడిదారు సారోస్‌ సంచలన వ్యాఖ్యలు

ఎంచుకున్న వారితో ప్రభుత్వాన్ని నడిపే కుట్ర

ఇది దేశ ప్రజాస్వామ్యంపై యుద్ధమే: స్మృతి

సారోస్‌ ఎన్నికల ఫలితాల్ని నిర్దేశించలేరు

విపక్షాలే తేల్చగలవన్న జైరాం రమేశ్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ వ్యాపార సామ్రాజ్యంలో ప్రకంపనలు పుట్టి, షేర్‌ మార్కెట్లు అతలాకుతలమై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు పెను సవాలుగా నిలిచింది. ఈ తరుణంలో యూర్‌పకు చెందిన బడా పెట్టుబడిదారు జార్జి సారోస్‌(92) తాజా వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన వ్యాపార మిత్రుడు గౌతమ్‌ అదానీ.. ఇద్దరి భవితవ్యం పరస్పరం ఆధారపడి ఉన్నాయని, ఈ ఇద్దరిలో ఏ ఒకరు మునిగినా మరొకరు మునగాల్సిందేనని చెప్పారు. ఇటీవల అదానీ కంపెనీల షేర్లు ఘోరంగా పతనమైన నేపథ్యంలో ప్రధానిగా మోదీ కూడా బలహీనపడతారని సారోస్‌ అంచనా వేశారు. ఇది భారతదేశానికి శుభ పరిణామమేనని, ప్రజాస్వామ్యవాది కాని మోదీ బలహీనపడితే దేశంలో మళ్లీ ప్రజాస్వామ్యం వేళ్లూనుకుంటుందని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన జర్మనీలోని మ్యూనిక్‌లో జరిగిన ఓ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘‘మోదీ, అదానీ అత్యంత సన్నిహితులు. వారిద్దరి భవితవ్యం పరస్పరం ఆధారపడి ఉన్నాయి. అదానీ షేర్ల ధరల మాయాజాలానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అతని షేర్లు పేకమేడల్లా కూలిపోయాయి. దీనిపై మోదీ అసలు పెదవి విప్పరు. కానీ, ఆయన విదేశీ పెట్టుబడిదారులకు, పార్లమెంటు సభ్యులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది’’ అని జార్జి సారోస్‌ వ్యాఖ్యానించారు. ‘‘అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదం భారత్‌ పట్ల పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బ తీసిందని చెప్పారు. ‘‘ఇది కేంద్ర ప్రభుత్వంపై మోదీ పట్టును చాలావరకు బలహీనం చేయనుంది. వ్యవస్థాగత సంస్కరణలకు మార్గం సుగమం అవుతుంది. నా మాటలు అజ్ఞానంగా అనిపించొచ్చు. కానీ భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘మోదీ ప్రజాస్వామ్య వాది కాదు. ముస్లిములకు వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టడమే ఆయన వేగంగా ఎదగడానికి ప్రధాన కారణం. రష్యా నుంచి కారుచౌకగా చమురు కొంటున్నారు. దానిపై భారీగా లాభాలు గడిస్తున్నారు’’ అని సారోస్‌ వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కుట్ర

సారోస్‌ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆయన భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించింది. ఇందులో ఆయన ఎంచుకొన్న కొందరు వ్యక్తులతో ప్రభుత్వాన్ని నడిపించాలన్న కుట్ర కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. సారోస్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు. ఇది భారతదేశంపై యుద్ధమేనని వ్యాఖ్యానించారు. సారోస్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ను నిలువునా ముంచిన ఆర్థిక యుద్ధ నేరగాడని ఆరోపించారు. భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకొనే ఉద్దేశాన్ని బయట పెట్టుకున్నాడని వ్యాఖ్యానించారు. దేశ ప్రజాస్వామ్యంపై యుద్ధానికి, దేశ ప్రయోజనాలకు మధ్య మోదీ యోధుడిలాగా నిలుచున్నారని చెప్పారు. మోదీ లాంటి నేతలను లక్ష్యంగా చేసుకొని చేపట్టే కార్యక్రమాలకు సారోస్‌ ఏకంగా బిలియన్‌ డాలర్లు విరాళంగా ప్రకటించారని ప్రస్తావించారు. భారత్‌ అనేక విదేశీ శక్తులను గతంలో ఎదుర్కొందని, భవిష్యత్తులోనూ అలాంటి శక్తులను ఓడించి తీరతామని ప్రకటించారు. భారతీయులంతా సారో్‌సకు తగిన విధంగా గట్టి సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. సారో్‌సతో గొంతు కలిపే రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్యానికి సారోస్‌ లాంటి వ్యక్తుల సర్టిఫికెట్‌ అవసరం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ అన్నారు.

కాపాడాల్సింది సారోస్‌ కాదు, కాంగ్రెస్‌...

కాంగ్రెస్‌ ముఖ్యనేత జైరాం రమేశ్‌ కూడా సారోస్‌ వ్యాఖ్యలను ఖండించారు. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సారో్‌సకు సంబంధం లేదన్నారు. కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు, భారత ఎన్నికల ప్రక్రియపై ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఆధారపడి ఉంటుందని జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. నెహ్రూ వారసత్వం దేశంలో ఇంకా కొనసాగుతోందని, సారోస్‌ లాంటి వ్యక్తులు భారత ఎన్నికల ఫలితాలను నిర్దేశించలేరని అన్నారు. తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా మాట్లాడుతూ, దేశ ప్రజలు సారో్‌సకు గట్టిగా బదులిచ్చే కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 6 గంటలకు కంచాలను బాదుతూ చప్పుడు చేయాలని ఎద్దేవా చేశారు. శివసేన నేత ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ, ‘‘బీజేపీ ఒక విలేకరుల సమావేశం మొత్తాన్ని సారో్‌సకే ఎందుకు కేటాయించింది? భారత ఎన్నికల్లో ఇజ్రాయెల్‌ సంస్థ(పెగాసస్‌) జోక్యం గురించి మంత్రి స్మృతీ ఇరానీ విలేకరుల సమావేశంలో ఎందుకు మాట్లాడలేదు?’’ అని ప్రశ్నించారు.

జార్జి సారోస్‌

ఎవరంటే?ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుల్లో జార్జి సారోస్‌ ఒకరు. ఆయన హంగరీలో పుట్టి, నాజీల దురాగతాల నుంచి బయటపడి చివరకు బ్రిటన్‌ చేరుకున్న యూదు జాతీయుడు. హెడ్జ్‌ ఫండ్‌లు పెట్టి వేగంగా తన సంపదలు పెంచుకున్నారు. 1984లో ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్స్‌ ఏర్పాటుచేసి ప్రపంచ వ్యాప్తంగా నియంతృత్వాలకు వ్యతిరేకంగా జరిగే ప్రజాస్వామ్య పోరాటాలకు ఫండింగ్‌ చేస్తున్నారు. 120 దేశాల సంస్థలు సారోస్‌ నుంచి సాయం అందుకుంటున్నాయి. 2018లో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసిన రాఫెల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంలో లొసుగులను వెలుగులోకి తెచ్చిన ఫ్రెంచ్‌ స్వచ్ఛంద సంస్థ షెర్ఫా అసోసియేషన్‌కు ఈయనే నిధులు సమకూర్చారు. షార్ట్‌ సెల్లింగ్‌లో దిట్ట. బ్రిటన్‌ పౌండ్‌ను షార్ట్‌ సెల్లింగ్‌ చేసి, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ను దివాలా స్థాయికి తీసుకొచ్చిన ఘనుడు. ఆయన వాణిజ్య ఎత్తుగడలు తమ దేశాన్ని అస్థిరం చేసే కుట్రలో భాగమంటూ పలు దేశాలు ఆయనపై ఆరోపణలు చేశాయి.

ఎవరంటే?ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుల్లో జార్జి సారోస్‌ ఒకరు. ఆయన హంగరీలో పుట్టి, నాజీల దురాగతాల నుంచి బయటపడి చివరకు బ్రిటన్‌ చేరుకున్న యూదు జాతీయుడు. హెడ్జ్‌ ఫండ్‌లు పెట్టి వేగంగా తన సంపదలు పెంచుకున్నారు. 1984లో ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్స్‌ ఏర్పాటుచేసి ప్రపంచ వ్యాప్తంగా నియంతృత్వాలకు వ్యతిరేకంగా జరిగే ప్రజాస్వామ్య పోరాటాలకు ఫండింగ్‌ చేస్తున్నారు. 120 దేశాల సంస్థలు సారోస్‌ నుంచి సాయం అందుకుంటున్నాయి. 2018లో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసిన రాఫెల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంలో లొసుగులను వెలుగులోకి తెచ్చిన ఫ్రెంచ్‌ స్వచ్ఛంద సంస్థ షెర్ఫా అసోసియేషన్‌కు ఈయనే నిధులు సమకూర్చారు. షార్ట్‌ సెల్లింగ్‌లో దిట్ట. బ్రిటన్‌ పౌండ్‌ను షార్ట్‌ సెల్లింగ్‌ చేసి, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ను దివాలా స్థాయికి తీసుకొచ్చిన ఘనుడు. ఆయన వాణిజ్య ఎత్తుగడలు తమ దేశాన్ని అస్థిరం చేసే కుట్రలో భాగమంటూ పలు దేశాలు ఆయనపై ఆరోపణలు చేశాయి.

Updated Date - 2023-02-18T03:26:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising