ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jairam Ramesh: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు జైరాం రమేశ్ కౌంటర్.. మణిపూర్, ఉజ్జయిని సంగతేంటి?

ABN, First Publish Date - 2023-10-02T22:14:44+05:30

మహిళల భద్రత విషయంలో రాజస్థాన్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలకు గాను కాంగ్రెస్ సీనియర్ నేత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలపై ఆరోపణలు చేసే మోదీ.. తమ హయాంలో జరిగిన ఘోరాల...

మహిళల భద్రత విషయంలో రాజస్థాన్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలకు గాను కాంగ్రెస్ సీనియర్ నేత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలపై ఆరోపణలు చేసే మోదీ.. తమ హయాంలో జరిగిన ఘోరాల గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడరని విరుచుకుపడ్డారు. తాము జవాబుదారీతనం తీసుకున్నట్టు.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గానీ, ప్రధాని మోదీ గానే బాధ్యత తీసుకోరని ధ్వజమెత్తారు. కేవలం అబద్ధాలను మాత్రం నర్మగర్భంగా చెప్తారని చురకలంటించారు.


రాజస్థాన్‌లో ఎన్నికలు రాబోతుండటంతో.. ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. దేశంలో ఎక్కడైనా అమ్మాయిలు/మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు తనకు బాధ కలుగుతుందని.. కానీ రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీన్ని ఆచారంగా చేసిందని మోదీ ఆరోపించారు. మహిళలకు భద్రత కరువైందని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై జైరాం రమేశ్ స్పందిస్తూ.. ప్రధాని మోదీ మణిపూర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడరని, ఉజ్జయినిలో ఓ బాలికపై జరిగిన ఘోరం గురించి ప్రస్తావించరని మండిపడ్డారు. మహిళా రెజ్లర్లపై దౌర్జన్యాలకు పాల్పడిన సొంత పార్టీ ఎంపీపైనా స్పందించలేదని, ఢిల్లీ పోలీసుల దౌర్జన్యాన్ని కూడా ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ.. ఎన్నికల ప్రచార సమయం వచ్చినప్పుడు మాత్రం తాను ఎల్లప్పుడూ ఉత్తమంగా చేసే పనే చేస్తారని, అదే నర్మగర్భంగా అబద్ధాలు చెప్తారని విరుచుకుపడ్డారు.

కనీసం మహాత్మా గాంధీ జయంతి రోజైనా మోదీ తన అబద్ధాలు, వక్రీకరణలు, పరువు నష్టం నుంచి దేశాన్ని విడిచిపెతారని తాము అనుకున్నామని.. కానీ అలా జరగలేదని జైరాం రమేశ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలపై జరిగే హింసను ఎప్పుడూ క్షమించదని.. రాజస్థాన్ ప్రభుత్వం అన్ని కేసుల్లోనూ వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా కసరత్తు చేస్తోందని అన్నారు. బీజేపీ ప్ఱభుత్వాలు మాత్రం ఇలాంటి కేసుల్లో బాధ్యత గానీ జవాబుదారీతనం గానీ అంగీకరించవని.. ఇదే కాంగ్రెస్‌కు, బీజేపీకి ఉన్న తేడా అని ఆయన వివరించారు.

Updated Date - 2023-10-02T22:14:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising