ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jairam Ramesh: అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తప్పే కాంగ్రెస్ కొంపముంచింది.. జైరాం రమేశ్ కుండబద్దలు

ABN, Publish Date - Dec 25 , 2023 | 08:02 PM

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. హిందీ హార్ట్‌ల్యాండ్‌లోని మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఆ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనుకున్న కాంగ్రెస్‌కు...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. హిందీ హార్ట్‌ల్యాండ్‌లోని మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఆ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనుకున్న కాంగ్రెస్‌కు నిరాశ తప్పలేదు. ఈ ఓటమిపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ స్పందించారు. ఇండియా కూటమిలోని మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకోకపోవడం వల్లే తాము నష్టపోయామని ఆయన కుండబద్దలు కొట్టారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకపోవడం వల్ల నష్టపోయాం. ఈ పలితాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. మాకు ఎలాంటి అహం లేదు. ఆ ఎన్నికల్లో మేము మిత్రపక్షాలతో పోత్తు పెట్టుకొని ఉండే బాగుండేది’’ అని ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


జైరాం రమేశ్ ఇంకా మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో సీట్ల పంపకంపై చర్చ జరుగుతోందని అన్నారు. సీట్ల పంపకం పనులు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. భారత్ మారుతుందని, భారత్ తప్పకుండా గెలుస్తుందన్న పూర్తి విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని, వాటిని ఎదుర్కుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలోనూ.. ప్రసంగాలకు సమయం లేదని, ముందుగా సీట్ల పంపకాలపై చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తేల్చి చెప్పారని అన్నారు. ఇండియా కూటమిలో విభేదాలు లేవని స్పష్టం చేసిన ఆయన.. సీపీఎం, టీఎంసీ సహా అన్ని పార్టీలు కలిసే ఉన్నాయన్నారు. మున్ముందు మరిన్ని సమావేశాలు జరుగుతాయని తెలిపారు. సీట్ల పంపకంపై అందరూ ఏకాభిప్రాయంతో ముందుకు వెళతారని, ఇండియా కూటమి ఐక్యతతో ముందుకు సాగుతుందని క్లారిటీ ఇచ్చారు.

విపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారు? అనే ప్రశ్నకు బదులిస్తూ.. తమకు బేస్ కావాలని, ఫేస్ కాదని జైరాం రమేశ్ పేర్కొన్నారు. మోదీ ముందు ఎవరున్నది ముఖ్యం కాదని, మోదీ ముందు ఏమిటన్నది ప్రధాన ప్రశ్న అని చెప్పారు. ఎన్నికలంటే అందాల పోటీ కాదని అన్నారు. ఉపరాష్ట్రపతి మిమిక్రీ వివాదంపై రియాక్ట్ అవుతూ.. పార్లమెంట్‌ను ఉల్లంఘించడం, మైసూర్‌కు చెందిన బీజేపీ ఎంపీ పాత్ర, హోంమంత్రి దీనిపై ప్రకటన చేయకపోవడమేనని చెప్పారు. ప్రధాని బయట ఓ ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడారు కానీ, హోంమంత్రి మాత్రం సభలో మౌనం పాటిస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంలకు కూడా తాము వ్యతిరేకం కాదని.. దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు, సూచనల విషయంలో ఎన్నికల కమిషన్‌ను కలవాలని అనుకుంటున్నామని వెల్లడించారు. కానీ ఎన్నికల సంఘం తమకు సమయం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 25 , 2023 | 08:02 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising