ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

jallikattu: అవనియాపురంలో నేడు అట్టహాసంగా జల్లికట్టు

ABN, First Publish Date - 2023-01-15T09:01:07+05:30

మదురై జిల్లా అవనియాపురంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జల్లికట్టు(jallikattu) సాహసక్రీడ ఆదివారం ఉదయం భారీ ఏర్పాట్ల నడుమ, సుప్రీంకోర్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బరిలోకి 800 ఎద్దులు

పెరంబూర్‌(చెన్నై), జనవరి 14: మదురై జిల్లా అవనియాపురంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జల్లికట్టు(jallikattu) సాహసక్రీడ ఆదివారం ఉదయం భారీ ఏర్పాట్ల నడుమ, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అట్టహాసంగా నిర్వహించనున్నారు. సంకాంత్రి పండుగ సందర్భంగా అవనియాపురం, పాలమేడు, అలంగానల్లూరు ప్రాంతాల్లో తమిళుల ప్రాచీన సాహసకీడ్ర జల్లికట్టును నిర్వహించడం ఆనవాయితీ. ఆ మేరకు తొలి జల్లికట్టు క్రీడకు అవనియాపురం వాడివాసల్‌ సిద్ధమవుతోంది. అవనియాపురం జల్లికట్టును యేళ్ళతరబడి నిర్వహిస్తూ వచ్చిన తెన్‌కాల్‌ సాగునీటి రైతుల సంఘానికి, అవనియాపురం గ్రామకమిటీకి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో ఈసారి ఈపోటీలను జిల్లా యంత్రాంగం, పురపాలక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ పోటీల నిర్వహణకు పురపాలక సంఘం రూ.17లక్షల మేరకు టెండర్లు పిలిచిమరీ ఏర్పాట్లను చేపడుతోంది. వాడివాసల్‌ను నిర్మించడం, బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం, ప్రేక్షకుల గ్యాలరీ, వెటర్నరీ పరీక్షా కేంద్ర నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి. సుమారు 50 మంది కార్మికులు ఈ పనులు నిర్వహిస్తున్నారు. ఇక ఆదివారం ఈ ప్రాంతంలో జరుగనున్న జల్లికట్టు క్రీడలో 800 ఎద్దులు పాల్గొంటున్నాయి. వీటిని అణిచివేయడానికి మదురై, శివగంగై, దిండుగల్‌, తేని తదితర జిల్లాలకు చెందిన 400 మంది సాహస క్రీడాకారులు పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిని రౌండ్ల వారీగా జల్లికట్టు మైదానంలోకి అనుమతించనున్నారు. ఎద్దులను అణచివేసే క్రీడాకారులకు, ఎవరికీ పట్టుచిక్కకుండా తప్పించుకునే ఎద్దుల యజమానులకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. సైకిళ్లు, బీరువాలు, బంగారు కాసులు తదితర కానుకలను వీరికి అందిస్తారు. ఈ క్రీడల సందర్భంగా గాయపడే వీరులకు తక్షణ చికిత్సలందించడానికి వైద్య బృందాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఆరు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచనున్నారు. ఈ పోటీలకు అవనియాపురం పోలీసు కమిషనర్‌ నరేంద్రనాయర్‌ నాయకత్వంలో డిప్యూటీ పోలీసు కమిషనర్‌ సాయి ప్రణీత్‌ పర్యవేక్షణలో 15 మంది అసిస్టెంట్‌ పోలీసు కమిషనర్లు, 45 మంది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, 150 మంది ఎస్‌ఐలు సహా 1300 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు.

Updated Date - 2023-01-15T09:01:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising