JDS: రైతుల పిల్లల పెళ్లిళ్లకు రూ.2 లక్షలు ఇస్తాం..
ABN, First Publish Date - 2023-03-09T13:07:20+05:30
ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ప్రజలను ఆకట్టుకునే దిశగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ మూడు పథకా
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ప్రజలను ఆకట్టుకునే దిశగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ మూడు పథకాలను ప్రకటించగా తాజాగా జేడీఎస్ నేత కుమారస్వామి(Kumaraswamy) అన్నదాతలను ఆకట్టుకునే దిశగా ఓ పథకాన్ని ప్రకటించారు. తుమకూరు జిల్లా తిపటూరు నియోజకవర్గం హాల్‌మురకి గ్రామంలో పంచరత్న రథయాత్ర రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ జేడీఎస్(JDS) అధికారంలోకి వస్తే రైతుల పిల్లల పెళ్లిళ్లకు రూ. 2 లక్షలు చెల్లించే పథకాన్ని తీసుకొస్తామన్నారు. జేడీఎస్ పార్టీ హామీలను నెరవేర్చే విషయంలో కట్టుబడి ఉందన్నారు. తమకు అధిష్టానం లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతామన్నారు. తిపటూరు పరిధిలో పలు గ్రామాలలో ర్యాలీ సాగింది.
Updated Date - 2023-03-09T13:07:20+05:30 IST