ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jharkhand IT Raids: ఆ నోట్ల గుట్టలకు కాంగ్రెస్‌తో సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

ABN, First Publish Date - 2023-12-10T16:55:05+05:30

ఇటీవల ఆదాయపు పన్ను శాఖ జార్ఖండ్‌లో రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన ప్రాంగణాల్లో నిర్వహించిన దాడుల్లో నోట్ల గుట్టలు దొరికిన సంగతి తెలిసిందే. ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై ఒకటే విమర్శల మోత..

Jharkhand IT Raids: ఇటీవల ఆదాయపు పన్ను శాఖ జార్ఖండ్‌లో రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన ప్రాంగణాల్లో నిర్వహించిన దాడుల్లో నోట్ల గుట్టలు దొరికిన సంగతి తెలిసిందే. ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై ఒకటే విమర్శల మోత మోగించేస్తున్నారు. కాంగ్రెస్ అవినీతికి కేరాఫ్ అని చెప్పడానికి ఈ ఒక్క ఘటనే ఉదాహరణ అని విమర్శలు ఎక్కుపెట్టారు. తాజాగా ఈ విమర్శలకు కాంగ్రెస్ నాయకుడు, జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా చెక్ పెట్టారు. ఆ డబ్బుతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టం చేయాల్సిన బాధ్యత కేంద్ర సంస్థపైనే ఉందని అన్నారు.


జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ దీరజ్ సాహు ఒక పెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి అని.. దాడుల్లో ఐటీ శాఖ రికవరీ చేసిన ఆ భారీ నగదుకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకోవడం కోసం సరైన విచారణ జరపాలని బన్నా గుప్తా చెప్పారు. ‘‘ధీరజ్ సాహు ఒక పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి. అతను వ్యాపార ప్రయోజనాలను కలిగి ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ధీరజ్ కుటుంబం తమ వ్యాపారాల్ని నడుపుతోంది. డబ్బు మూలంపై వివరణాత్మక స్పష్టతని ఐటీ శాఖ విచారణ ద్వారా తెలియజేయాలని నేను నమ్ముతున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. లంచం తీసుకొని అంత భారీ నగదుని ధీరజ్ దాచుకున్నాడని చెప్పడం సమంజసం కాదని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు. విచారణ తర్వాతే పూర్తి స్పష్టత వస్తుందన్నారు. సాహు వ్యక్తిగత వ్యాపారానికి, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఇదిలావుండగా.. ఒడిశా, జార్ఖండ్‌లలో బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల్లో ఐటీ శాఖ నిర్వహించిన దాడులు ఐదో రోజుకి చేరుకుంది. ఇప్పటివరకూ ఈ సోదాల్లో రూ.290 కోట్ల భారీ నగదు పట్టుబడింది. ఇది కాంగ్రెస్ ఎంపీ దీరజ్ సాహుతో ముడిపడి ఉందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో.. బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విమర్శల దండయాత్రని మొదలుపెట్టారు. ఈ కరెన్సీ నోట్లను చూసి నిజాయితీపై కాంగ్రెస్ నేతల ప్రసంగాలు వినాలని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ప్రజల నుండి దోచుకున్న ప్రతి పైసా తిరిగివ్వాలని, ఇది మోదీ హామీ అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్‌తో ఈ డబ్బులకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి బన్నా గుప్తా వివరణ ఇచ్చారు.

Updated Date - 2023-12-10T16:55:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising