ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: చంద్రయాన్-3 కోసం పనిచేసిన కార్మికులు టీ అమ్ముకుంటున్నారు.. పరిస్థితి దారుణంగా దిగజారింది

ABN, First Publish Date - 2023-09-21T16:36:35+05:30

చంద్రయాన్-3 లాంచ్‌ప్యాడ్ తయారీకి పని చేసిన ఓ వ్యక్తి ఇడ్లీలు అమ్ముకుంటున్నాడన్న విషయాన్ని రీసెంట్‌గానే మనం చెప్పుకున్నాం. చంద్రయాన్ మిషన్ కోసం లాంచ్ ప్యాడ్‌లు, ఇతర పరికరాలను సరఫరా చేసే...

చంద్రయాన్-3 లాంచ్‌ప్యాడ్ తయారీకి పని చేసిన ఓ వ్యక్తి ఇడ్లీలు అమ్ముకుంటున్నాడన్న విషయాన్ని రీసెంట్‌గానే మనం చెప్పుకున్నాం. చంద్రయాన్ మిషన్ కోసం లాంచ్ ప్యాడ్‌లు, ఇతర పరికరాలను సరఫరా చేసే హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఈసీ) అనే ప్రభుత్వ సంస్థలో పని చేసే దీపక్ కుమార్ అనే టెక్నీషియన్‌కు.. గత 18 నెలలుగా జీతం అందడం లేదని, అందుకే పొట్టకూటి కోసం రాంచిలోని రోడ్డు పక్కన ఇడ్లీల దుకాణం నిర్వహిస్తున్నాడని మాట్లాడుకున్నాం. కేవలం ఈయనొక్కడే కాదు.. ఆ కంపెనీలో పని చేస్తున్న 2,800 కార్మికులకు కూడా జీతాలు అందలేదు. దీంతో.. దీపక్ తరహాలోనే వాళ్లు ఇడ్లీలు, టీలు అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నారు.


ఈ అంశాన్ని జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) ఎంపీ మహువా మాజీ రాజ్యసభలో లేవనెత్తారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘చంద్రయాన్ 1, 2, 3 మిషన్‌ల కోసం లాంచ్ ప్యాడ్, అనేక పరికరాలు హెచ్‌ఈసీలో తయారు చేయబడ్డాయి. ఈ ప్రభుత్వ సంస్థను పండిట్ నెహ్రూ 1952లో స్థాపించారు. 2014కి ముందు వరకు ఈ సంస్థ పరిస్థితి బాగానే ఉంది కానీ, ఆ తర్వాతే దిగజారుతూ వచ్చింది. ఈ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, అధికారులకు గత 18 నెలలుగా జీతాలివ్వడం లేదు. దీంతో.. వాళ్లందరూ తమ జీవనం గడపడం కోసం టీ, ఇడ్లీలు అమ్ముకుని ఆఫీసుకు వెళ్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రయాన్-3 విజయవంతం అయ్యిందని మాటలు చెప్పడం కాదని, దాని కోసం పని చేసిన వారిని కూడా పట్టించుకోవాలని ఆమె కోరారు.

అయితే.. ఇంతలో పీయూష్ గోయల్ జోక్యం చేసుకొని, ఇలాంటి ఆరోపణల వెనుక వాస్తవాలు ఉండాలని చెప్పారు. వాస్తవాలతో ఇలాంటి ఆరోపణలు చేస్తే తాను అర్థం చేసుకోగలనని, ఈ అంశాన్ని ధృవీకరించాలని మహువాని పీయూష్ డిమాండ్ చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ సైతం మాట్లాడుతూ.. ఎవరైనా, ఏదైనా స్టేట్‌మెంట్ ఇస్తే.. దాన్ని నిరూపించాల్సిన బాధ్యత కూడా వారిదేనని అన్నారు. ఇందుకు మహువా బదులిస్తూ.. సాక్ష్యాధారాలను సమర్పించడానికి తాను సిద్ధమేనన్నారు. ఈ అంశంపై హెచ్ఈసీ ఉద్యోగులు గురువారం జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగబోతున్నారని, తన ఆరోపణలకు ఇదే నిదర్శనమని చెప్పారు. హెచ్‌ఈసీ పరిస్థితి దారుణంగా ఉందని, మూలధనం లేకపోవడంతో వల్ల ఆర్డర్లు పూర్తి అవ్వట్లేదని వాదించారు.

Updated Date - 2023-09-21T16:36:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising