ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India-Canada Row: భారత్ దెబ్బకు కిందకు దిగొచ్చిన కెనడా ప్రధాని.. వివాదాన్ని పెంచడం ఇష్టం లేదన్న ట్రూడో

ABN, First Publish Date - 2023-10-03T22:24:52+05:30

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఇప్పుడు కిందకు దిగొచ్చారు. ఈ వివాదాన్ని ముందుకు...

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఇప్పుడు కిందకు దిగొచ్చారు. ఈ వివాదాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇష్టం లేదని పేర్కొన్నారు. న్యూఢిల్లీతో బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మకంగా తమ బంధాన్ని కొనసాగిస్తామని అన్నారు. భారతదేశంలోని కెనడియన్ కుటుంబాలకు సహాయం చేసేందుకు తాము అక్కడే ఉండాలని అనుకుంటున్నామని తెలిపారు. అక్టోబర్ 10వ తేదీలోగా 40 మంది దౌత్య సిబ్బందిని వెనక్కు పిలిపించుకోవాలని కెనడాకు భారత్ అల్టిమేటం జారీ చేసిన అనంతరం ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు.


భారత్-కెనడా మధ్య వివాదం ఎలా చెలరేగింది?

జూన్ 18వ తేదీన సర్రేలోని గురుద్వారా వెలుపల ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేయడంతో.. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఆ ఆరోపణలు చేయడంతో పాటు భారత దౌత్యాధికారిని సైతం కెనడా బహిష్కరించింది. దీంతో మండిపడ్డ భారత్.. ట్రూడో ఆరోపణల్ని తోసిపుచ్చడంతో పాటు భారత్‌లో ఉన్న కెనడా దౌత్యాధికారిని బహిష్కరించింది. అంతేకాదు.. కెనడా నుంచి వచ్చే వాళ్లకు తాత్కాలికంగా వీసా సర్వీసుల్ని నిలిపివేసింది. ట్రూడో చేసిన ఆరోపణలు తగిన సమాచారం ఇవ్వాలని కూడా భారత్ నిలదీసింది.

అయితే.. భారత్ అభ్యర్థనపై కెనడా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఒకవేళ తాము బహిరంగంగా వివరాలు బయటపెడితే విచారణకు భంగం వాటిల్లుతుందని కెనడా సాకులు చెప్తూ వచ్చింది. ఇలా భారత్, కెనడా మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్న తరుణంలో భారత్ ఒక అల్టిమేటం జారీ చేసింది. దౌత్య సిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాల్సిన అవసరం ఉందని చెప్తూ.. 40 మంది దౌత్యాధికారుల్ని వెనక్కు పిలిపించుకోవాలని ఒట్టావాకు చెప్పింది. దీంతో కెనడా ప్రధాని కిందకు దిగి రావాల్సి వచ్చింది. ఈ వివాదానికి నిప్పు పెట్టింది తానే కాబట్టి, ఇప్పుడు దీనిని చల్లార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

అంతకుముందు.. కెనడా చేసిన ఆరోపణలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా సీరియస్‌గానే స్పందించారు. వేర్పాటువాదులకు కెనడా ఒక స్వర్గధామంగా మారిందని పేర్కొన్నారు. ఖలిస్తానీ వ్యవహారాలకు సంబంధించిన వివరాలను తాము కెనడాతో పంచుకున్నామని, అప్రమత్తం కూడా చేశామని.. కానీ కెనడా ప్రభుత్వమే సరైన చర్యలు తీసుకోలేదని అన్నారు. కెనడా ప్రధాని ఆరోపణల్లో వాస్తవం లేదని, అసలు అది భారత ప్రభుత్వ విధానం కాదని (నిజ్జర్‌ని హత్య చేయడం) తెలిపారు. వాళ్లు సంబంధిత సమాచారాన్ని పంచుకుంటే, అందుకు తగిన చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధంగానే ఉన్నామని విశదీకరించారు.

Updated Date - 2023-10-03T22:24:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising