ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐరాసలో కైలాస.. ఎలా?

ABN, First Publish Date - 2023-03-02T01:50:36+05:30

స్వయంప్రకటిత దేవుడు.. రేప్‌, కిడ్నాప్‌ కేసుల్లో నిందితుడు అయిన నిత్యానంద స్వామి సొంత దేశం ‘కైలాస’ ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పౌరసమాజ సంస్థ ముసుగులో సదస్సులోకి నిత్యానంద స్వామి ప్రతినిధుల ప్రవేశం

సెంట్రల్‌ డెస్క్‌: స్వయంప్రకటిత దేవుడు.. రేప్‌, కిడ్నాప్‌ కేసుల్లో నిందితుడు అయిన నిత్యానంద స్వామి సొంత దేశం ‘కైలాస’ ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) సదస్సుకు హాజరయ్యారన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది! నిజంగా ఇది నిజమేనా? దేశం విడిచి పారిపోయి.. తనకున్న డబ్బు, పరపతితో ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నట్టు ప్రకటించిన నిత్యానందస్వామి లాంటి వ్యక్తుల ప్రతినిధులకు ఐక్యరాజ్యసమితిలో ప్రవేశం ఎలా లభించింది? అలా ఎవరిని పడితే వారిని మాట్లాడడానికి అనుమతిస్తారా? నిత్యానందలా రేపు మరో నేరగాడు ఎవరైనా తానో దేశాన్ని ఏర్పాటు చేశానని ప్రకటించి తన ప్రతినిధులను యూఎన్‌కు పంపిస్తే వారికి కూడా మాట్లాడే అవకాశం ఇచ్చేస్తారా? ..అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇదంతా నిత్యానంద స్వామి ప్రచార బృందం చేస్తున్న గిమ్మిక్కు మాత్రమే. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల (సీఈఎ్‌సఆర్‌) కమిటీ జెనీవాలో నిర్వహించిన సదస్సుకు కైలాస తరఫున ‘మా విజయప్రియ నిత్యానంద’ తదితరులు హాజరైన మాట నిజమేగానీ.. వారు కైలాస దేశ ప్రతినిధులుగా అక్కడికి వెళ్లలేదు. ఈ ‘సీఈఎ్‌సఆర్‌’ అనేది.. సాంస్కృతి, సామాజిక, ఆర్థిక హక్కులకు సంబంధించి ఐక్యరాజ్యసమితిలో 1966లో కుదిరిన ఒప్పందం సరిగా అమలవుతోందా లేదా పర్యవేక్షించే వేదిక. దీంట్లో 18 మంది స్వతంత్ర నిపుణులు ఉంటారు. ఈ వేదిక నిర్వహించే సదస్సులకు సివిల్‌ సొసైటీ గ్రూపులను కూడా అనుమతిస్తుంది. ఇదుగో.. ఆ మార్గంలోనే కైలాస ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ‘కైలాస యూనియన్‌’ అనే సివిల్‌ సొసైటీ ఆర్గనైజేషన్‌ పేరుతో సదస్సుకు హాజరు కావడానికి పత్రాలు సమర్పించారు. అది అమెరికాలో రిజిస్టర్‌ అయిన సంస్థ.

కాలిఫోర్నియాలోని మాంట్‌క్లెయిర్‌లో తమ సంస్థ ఉన్నట్టుగా అందులో పేర్కొన్నారు. ఆ అడ్ర్‌సను గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూలో వెతికితే.. అక్కడ ‘నిత్యానంద వేదిక్‌ టెంపుల్‌’ అనే భవనం కనిపిస్తుంది. ఇలా ఆ సంస్థ పేరుతో సదస్సులోకి చొరబడ్డ కైలాస ప్రతినిధులు.. అక్కడ నిత్యానంద ఫొటోలు పెట్టి.. మోకాళ్లపై నిలబడి ఆ ఫొటోలకు దణ్నాలు పెట్టి.. అక్కడున్నవారందరికీ భగవద్గీత పుస్తకాలు ఇచ్చి (ఆ పుస్తకాలపై కృష్ణుడి బొమ్మకు బదులు నిత్యానంద బొమ్మ ఉంది).. హల్‌ చల్‌ చేశారు. భారత్‌పై అవాకులు చవాకులు పేలారు. ఈ ఫొటోలన్నీ తమ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా వైరల్‌ చేసి.. ఐక్యరాజ్య సమితి తమ దేశాన్ని గుర్తించిందన్నంత బిల్డప్‌ ఇచ్చారు. కానీ అదంతా ఉత్తుత్తి ప్రచారమే. నిజానికి సీఈఎ్‌సఆర్‌ నిర్వహించే సదస్సులకు ఇలాంటి నకిలీ సంస్థలు, వ్యక్తులు హాజరవుతున్నారన్న ఆందోళనలు చాలాకాలం నుంచే ఉన్నాయి. అయినా పరిస్థితిలో మార్పు రావట్లేదు. చివరాఖరు: ఐక్యరాజ్యసమితిలో ప్రస్తుతం 193 సభ్య, సార్వభౌమదేశాలున్నాయి. వాటిలో ‘కైలాస’ లేదు. అసలు యూఎన్‌లో సభ్య దేశం కావడం అంత సులువు కాదు. అందుకు చాలా కఠినమైన నిబంధనలుంటాయి. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ, భద్రతామండలి రెండింటి ఆమోదం ఉంటే తప్ప సభ్య దేశం హోదా రాదు. కాబట్టి ‘కైలాస’కు ఎక్కడ దేశం హోదా వచ్చేస్తుందో అని కంగారు పడక్కర్లేదు.

Updated Date - 2023-03-02T03:33:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!