ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rohini Sindhuri IAS vs Roopa IPS: రూపా, రోహిణి తీరుపై సీఎం ఆగ్రహం.. ఈ ఇద్దరిపై దుమ్మెత్తిపోస్తున్న కన్నడిగులు

ABN, First Publish Date - 2023-02-21T12:01:40+05:30

కర్ణాటక రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ ఐఏఎస్‌ రోహిణి సింధూరి, రాష్ట్ర చేతివృత్తుల కార్పొరేషన్‌ ఎండీ ఐపీఎస్‌ రూపా మౌద్గల్‌ పరస్పర ఆరోపణల తీరుపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ ఐఏఎస్‌ రోహిణి సింధూరి, రాష్ట్ర చేతివృత్తుల కార్పొరేషన్‌ ఎండీ ఐపీఎస్‌ రూపా మౌద్గల్‌ పరస్పర ఆరోపణల తీరుపై ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మండిపడ్డారు. ఈ మేరకు ఇద్దరు అధికారులకు నోటీసులు జారీ చేయాలని చీఫ్‌ సెక్రటరీని ఆదేశించారు. అందుకు అనుగుణంగానే సోమవారం మధ్యాహ్నం ఐఏఎస్‌ రోహిణి సింధూరి విధానసౌధలో చీఫ్‌ సెక్రటరీ వందితాశర్మను భేటీ అయ్యారు. నాలుగు పేజీలతో ఐపీఎస్‌ రూపా మౌద్గల్‌ ఆరోపణలకు వివరాలను అందించారు. తనపై సోషల్‌ మీడియాలో నిరాధార, అబద్ధాలు, వ్యక్తిగతమైన ఆరోపణలు చేశారని, సర్వీస్‌ రూల్స్‌ను ఉల్లంఘించిన మేరకు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

అనంతరం విధానసౌధలో రోహిణి సింధూరి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మీడియా ముందుకు రాకూడదనే నిబంధన ఉందన్నారు. కానీ వ్యక్తిగతంగా తనతోపాటు తన భర్తపైనా ఆరోపణలు చేశారన్నారు. చీఫ్‌ సెక్రటరీకి సమగ్రంగా వివరాలు అందించానని తెలిపారు. మండ్యలో సీఈఓగా శౌచాలయాలు రికార్డు స్థాయిలో నిర్మించినందుకు కేంద్రప్రభుత్వం గుర్తించిందని, ఇన్నేళ్ల తర్వాత ఆరోపణలు చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు ఫొటోలు పంపాననే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. జాలహళ్లిలోని నివాసం తన భర్త తల్లికి చెందినదన్నారు.

చీఫ్‌ సెక్రటరీని కలసిన ఐపీఎస్‌ రూపా

ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన మేరకు విధానసౌధలో సీఎస్‌ వందితా శర్మను ఐపీఎస్‌ రూపా మౌద్గల్‌ భేటీ అయ్యారు. అనంతరం మీడియా ముందుకు రాకూడదని భావించానని అయితే తనపై రోహిణి సింధూరి ఆరోపణలు చేసిన మేరకు స్పందించాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికే సీఎ్‌సకు వివరాలు తెలిపానని, ఆమె ఫొటోలు వ్యక్తిగతం కాదని, ఎవరు రక్షిస్తున్నారో బయటకు రావాలన్నారు. రోహిణిపై లోకాయుక్తకు చేరిన ఫిర్యాదుపై దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. జాలహళ్లి నివాసానికి సంబంధించి ఆస్తి పత్రంలో నమోదు చేయలేదని, తనది కాదంటే లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. సీఎ్‌సను కలిసేందుకు ముందు మీడియాతో మాట్లాడుతూ గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ పోస్ట్‌ చేశారని, డిలీట్‌ అయిన న్యూడ్‌ ఫొటోల గురించి మాట్లాడుతారా..? అంటూ రూపా ఆరోపించడం మరో సంచలనమైంది.

కళ్లు మూసుకోలేదు : హోంమంత్రి మండిపాటు

ఇద్దరు అధికారులు సోషల్‌ మీడియా వేదికగా చేస్తున్న ఆరోపణలపై కళ్లు మూసుకోలేదని, తీవ్రంగా పరిగణించామని హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర పేర్కొన్నారు. సోమవారం అధికారిక నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇద్దరి తీరు సమంజసంగా లేదన్నారు. ప్రజాసేవ చేయాల్సిన వారు ఇలాంటి ఆరోపణలతో ఐఏఎస్‌, ఐపీఎస్‌ కేడర్లకు అవమానం చేస్తున్నారన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇద్దరిపైనా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందేనని మాజీ సీఎం కుమారస్వామి డిమాండ్‌ చేశారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ అధికారులు ఇలా వ్యవహరిస్తే ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం వస్తుందన్నారు.

నాలా మరో ఆడపడుచుకు అవమానం వద్దు: డీకే రవి భార్య కుసుమ

తనకు జరిగిన అవమానం మరో ఆడపడుచుకు వద్దంటూ దివంగత ఐఏఎస్‌ అధికారి డీకే రవి భార్య కుసుమ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఆమె మీడియాతో మాట్లాడుతూ కర్మ ఎవరినీ వదలదని, జాప్యం కావచ్చునని పేర్కొన్నారు. నరకయాతన అనుభవించానని ఆమె వాపోయారు. ఐపీఎస్‌ రూపా మౌద్గల్‌కు తన మద్దతు ఉంటుందన్నారు. తన భర్త డీకే రవి మృతి విషయంలో నివేదికలో అన్నీ పొందుపరిచారని తెలిపారు.

రియల్‌ ఎస్టేట్‌ నా వ్యాపారం: సింధూరి భర్త సుధీర్‌రెడ్డి

50 ఏళ్ల క్రితం కర్ణాటకకు వచ్చామని తాను ఇక్కడే పుట్టానని, తాను కన్నడిగుడినే అంటూ ఐఏఎస్‌ రోహిణి సింధూరి భర్త సుధీర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. తన తండ్రి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని, ఇటీవలే మృతి చెందితే సదరు ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నానని పేర్కొన్నారు. తన భార్య ఐఏఎస్‌ అయినా ఎక్కడా ఆమె జోక్యం లేదని, ఆమె పలుకుబడిని దుర్వినియోగం చేయలేదన్నారు. అయితే తన వ్యక్తిగతమైన ఫొటోలను పోస్ట్‌ చేయడంపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. మృతి చెందిన డీకే రవి విషయాన్ని ప్రస్తావించడం మంచి విధానం కాదన్నారు. ఈ మేరకు ఐపీఎస్‌ రూపా మౌద్గల్‌పై బాగలగుంటె పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

నా కుమారుడి ప్రస్తావన వద్దు: డీకే రవి తల్లి గౌరమ్మ

ఇద్దరు అధికారులు వాగ్వాదాలు చేసుకుంటూ ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందిన తన కుమారుడు డీకే రవి ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదని ఆయన తల్లి గౌరమ్మ పేర్కొన్నారు. చెన్నపట్టణ తాలూకా కదరమంగల గ్రామంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తన కుమారుడి చావుకు రోహిణి సింధూరి బాధ్యురాలు కాదన్నారు. వారు స్నేహితులని, చదువుకునే రోజులనుంచి మిత్రులుగా ఉండేవారన్నారు. తమ ఇంటికి సింధూరి మూడుసార్లు వచ్చారని పేర్కొన్నారు. ఇద్దరికీ ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుని ఉండేవారని, తమకు వ్యతిరేకత లేదన్నారు. జరిగిన విషయంలో తన కుమారుడి పేరు ప్రస్తావించవద్దన్నారు.

అసలేం జరిగిందంటే..

కర్ణాటకలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. పలు వివాదాలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవదాయశాఖ కమిషనర్‌ రోహిణి సింధూరి(ఐఏఎస్‌)పై హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రూపాముద్గల్‌(ఐపీఎస్‌) ఆదివారం ట్విటర్‌ ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు. రోహిణి వ్యక్తిగత ఫొటోలను కూడా అందులో పోస్ట్‌ చేశారు. ఐఏఎస్‌ రోహిణి, ఎమ్మెల్యే సారా మహేశ్‌తో రాజీ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని రూప ప్రశ్నించారు. ‘చామరాజనగరలో కొవిడ్‌ వేళ ఆక్సిజన్‌ అందక పలువురు మరణించిన అంశంలోనూ సక్రమంగా వ్యవహరించారా? కొవిడ్‌తో దేశమంతటా జనం తల్లడిల్లుతుంటే మైసూరు కలెక్టరేట్‌లో విలాసవంతమైన స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మించడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి’ అని విమర్శించారు. ఐపీఎస్‌ ఎన్‌.హరీశ్‌ మృతిపైనా అనుమానం వ్యక్తం చేశారు. జాలహళ్లిలో విలాసవంతమైన ఇల్లు నిర్మించే విషయాన్నీ ప్రస్తావించారు. ఆమెకు ఎవరు మద్దతిస్తున్నారో? ఇటువంటి వారికి ఎందుకు శిక్షలు పడవో అర్థం కావడం లేదన్నారు.

న్యాయ పోరాటం చేస్తా: రోహిణి

తనపై ఆరోపణలు చేసిన రూపపై న్యాయ పోరాటం చేస్తానని రోహిణి ఒక ప్రకటనలో తెలిపారు. ‘బాధ్యతాయుతమైన హోదాల్లో ఉన్నవారు సమాజానికి మంచి పనులు చేయాలిగానీ, వ్యక్తిగత విషయాలపై అబద్ధాలు పోస్టు చేయడం సరికాదు’ అన్నారు.

Updated Date - 2023-02-21T12:04:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising