ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DK Shivakumar: లా అండ్ ఆర్డర్ సమస్యలు తెచ్చేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం: డీకే శివకుమార్

ABN, First Publish Date - 2023-10-02T19:37:33+05:30

ఈద్(Eid) ఊరేగింపుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసిన ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

బెంగ‌ళూర్: ఈద్(Eid) ఊరేగింపుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసిన ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాంతిని కోరుకుంటుందని, ఇలాంటి ఘటనలను తాము ప్రోత్సహించబోమని పేర్కొన్నారు. ఘటనకు కారణమైన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశామని .. కఠిన చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకు ముందు ఈ ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు.


శివమొగ్గ(Shivamogga) జిల్లా రాగిగుడ్డ సమీపంలో ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపుల సందర్భంగా రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ అంశాన్ని సీరియస్ తీసుకున్న సిద్ధరామయ్య(CM Siddaramaiah) కారకులను పట్టుకోవాలని ఆదేశించారు. ఆయన ఆదేశానుసారం రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం 43 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని మతాల వారు పరస్పరం గౌరవించుకోవాలని, ఇతర మతాల వారిని దూషించినా, అవాంచిత ఘటనలకు పాల్పడిన సహించేది లేదని స్పష్టం చేశారు. పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. రాగిగుడ్డలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. మిలాన్ ఉన్ నబీ ఊరేగింపు సమయంలో చెలరేగిన ఘర్షణను శాంతింపజేయడానికి పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఈ ఘర్షణలో అయిదుగురు గాయపడ్డారు.

Updated Date - 2023-10-02T19:37:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising