AAP: జాతీయ పార్టీ హోదాపై 13లోగా నిర్ణయం
ABN, First Publish Date - 2023-04-07T23:20:54+05:30
జాతీయ పార్టీ గుర్తింపు కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) దాఖలు చేసుకున్న విజ్ఞప్తిపై ఏప్రిల్ 13లోగా నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక హైకోర్టు...
బెంగళూరు: జాతీయ పార్టీ గుర్తింపు కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) దాఖలు చేసుకున్న విజ్ఞప్తిపై ఏప్రిల్ 13లోగా నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) కేంద్ర ఎన్నికల సంఘానికి(CEC) సూచించింది. జాతీయ పార్టీ హోదా ఇవ్వాలని మూడు నెలల క్రితం కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసుకున్నా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని ఆప్ కార్యదర్శి కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119మంది, కాంగ్రెస్‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి.
కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
Updated Date - 2023-04-07T23:27:22+05:30 IST