Khushboo : కన్నతండ్రే లైంగికంగా వేధించాడు
ABN, First Publish Date - 2023-03-07T02:33:16+05:30
తన 8వ ఏట నుంచే కన్నతండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎనిమిదోఏట నుంచే నరకం చూశా
15వ ఏట తిరగబడితే పారిపోయాడు
మేం తిండి దొరక్క అష్టకష్టాలు పడ్డాం
నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు
చైన్నె,మార్చి 6 (ఆంధ్రజ్యోతి): తన 8వ ఏట నుంచే కన్నతండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 15వ ఏట తాను తిరగబడితే ఇంటి నుంచి పారిపోయాడన్నారు. ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అబ్బాయి కానీ, అమ్మాయి కానీ.. చిన్నవయసులో లైంగిక వేధింపులకు గురైతే వారి జీవితాంతం అవి చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయన్నారు. తండ్రిని ఎదుర్కోవడం కంటే.. ఎన్ని చిత్రహింసలు పెట్టినా పతియే ప్రత్యక్ష దైవమని భావించే తల్లికి లైంగిక వేధింపుల గురించి చెబితే నమ్ముతుందో లేదోనన్నో భయమే తనకు ఎక్కువ ఉండేదని వాపోయారు. ఆ భయంతోనే వేధింపులను ఎనిమిదేళ్ల పాటు మౌనంగా భరించానని చెప్పారు. తండ్రి ఇల్లు విడిచి పారిపోవడంతో.. తల్లి, తాను పూటకు పట్టెడన్నం కూడా లభించక అష్టకష్టాలు పడ్డామని ఖుష్బూ చిన్ననాటి కష్టాలను వివరించారు.
Updated Date - 2023-03-07T02:33:28+05:30 IST