ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారుపై 8 కి.మీ. లాక్కెళ్లి, మీదకు ఎక్కించి హత్య

ABN, First Publish Date - 2023-01-23T02:44:37+05:30

రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుడిని ఢీకొట్టడమే కాక, ఏకంగా 8 కిలోమీటర్ల మేర కారు ముందుభాగం(బొనెట్‌)పై లాక్కెళ్లి, అనంతరం కారు ఎక్కించి హత్య చేసిన ఓ దారుణ ఘటన ఇది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా, జనవరి 22: రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుడిని ఢీకొట్టడమే కాక, ఏకంగా 8 కిలోమీటర్ల మేర కారు ముందుభాగం(బొనెట్‌)పై లాక్కెళ్లి, అనంతరం కారు ఎక్కించి హత్య చేసిన ఓ దారుణ ఘటన ఇది. బిహార్‌లోని తూర్పు చంపారన్‌ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతుడిని కొత్వా పోలీసు స్టేషన్‌ పరిధిలోని బాంగ్రా గ్రామానికి చెందిన శంకర్‌ చౌదుర్‌(70)గా అధికారులు గుర్తించారు. బాంగ్రా చౌక్‌ ప్రాంతం వద్ద సైకిల్‌పై రోడ్డు దాటుతున్న శంకర్‌ను, గోపాల్‌గంజ్‌ పట్టణం నుంచి శరవేగంగా వస్తున్న ఓ కారు ఢీకొట్టింది. ఆ ధాటికి ఎగిరి కారు ముందుభాగంపై పడిన ఆయన అలా ఉండగానే, కారులోని దుండగులు వాహనాన్ని ముందుకు దూకించారు. కారు ఆపమని వృద్ధుడు బతిమాలుతున్నా వారి మనసు కరగలేదు. కొంతమంది వాహనదారులు కారును వెంబడించారు. అది గమనించిన దుండగులు కారును సడెన్‌ బ్రేక్‌ వేసి ఆపి.. శంకర్‌ కింద పడగానే ఆయనపై నుంచి దూసుకెళ్లారు. దీంతో శంకర్‌ అక్కడికక్కడే మృతిచెందారు.

Updated Date - 2023-01-23T02:44:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising