ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'Railway job' scam: రూ.600 కోట్ల అక్రమ లావాదేవీలు!

ABN, First Publish Date - 2023-03-12T03:50:53+05:30

‘రైల్వేలో ఉద్యోగానికి ప్రతిఫలంగా భూమి’’ కుంభకోణం కేసులో భారీగా అక్రమ లావాదేవీలను గుర్తించామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వర్గాలు పేర్కొన్నాయి. రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబంతో సంబంధమున్న ఈ లావాదేవీల ప్రస్తుత విలువ రూ.600 కోట్లు ఉంటుందని తెలిపాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

’రైల్వే ఉద్యోగానికి భూమి’ స్కాంలో గుర్తించాం.. రూ.350 కోట్ల స్థిరాస్తులు.. 250 కోట్ల నగదు

కొందరు బినామీల ద్వారా వ్యవహారం

తేజస్వీ 4 లక్షలకు కొన్న ఇల్లు 150 కోట్లు

వెల్లడించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

రూ.కోటి నగదు, బంగారం స్వాధీనం

సీబీఐ విచారణకు తేజస్వీ గైర్హాజరు

పట్నా, మార్చి 11: ‘‘రైల్వేలో ఉద్యోగానికి ప్రతిఫలంగా భూమి’’ కుంభకోణం కేసులో భారీగా అక్రమ లావాదేవీలను గుర్తించామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వర్గాలు పేర్కొన్నాయి. రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబంతో సంబంధమున్న ఈ లావాదేవీల ప్రస్తుత విలువ రూ.600 కోట్లు ఉంటుందని తెలిపాయి. లాలూ మంత్రిగా ఉన్న 2004-09 మధ్య జరిగినట్లు పేర్కొంటున్న ఈ కుంభకోణంలో ఆయన కుటుంబం పట్నా, ఇతరచోట్ల ఖరీదైన ప్రాంతాల్లో పలు ఆస్తులను అక్రమంగా కూడబెట్టినట్లు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఇందులో రూ.350 కోట్ల స్థిరాస్తులు, రూ.250 కోట్ల నగదు లావాదేవీలు ఉన్నట్లు చెప్పాయి. వీటికి సంబంధించిన జాబితానూ విడుదల చేసి, విచారణ కొనసాగుతున్నట్లు తెలిపాయి. కాగా, నాడు లాలూ కుటుంబ బినామీలు పొందిన భూమి మార్కెట్‌ విలువ నేడు రూ.200 కోట్లకు పైనే ఉంటుందని ఈడీ వర్గాలు వివరించాయి. తనిఖీల్లో పలువురు బినామీదారులు, డొల్ల కంపెనీలు, లబ్ధి పొందినవారిని గుర్తించామన్నాయి. ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్‌ కాలనీలో బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు చెందిన ఏబీ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట రూ.4 లక్షలకు కొనుగోలు చేసిన నాలుగు అంతస్తుల భవనం విలువ ప్రస్తుతం రూ.150 కోట్లు అని పేర్కొన్నాయి.

కాగా, కుంభకోణంపై ఈడీ శుక్రవారం ఢిల్లీ, ముంబై, రాంచీ, పట్నాలోని 24 ప్రదేశాల్లో తనిఖీలు చేసింది. ఇందులో లెక్కలు చూపని రూ.కోటి నగదు, 1900 డాలర్లు, 540 గ్రాముల బంగారం, కిలోన్నర బంగారు నగలతో పాటు లాలూ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు శనివారం నాడు ప్రకటించింది. గ్రూప్‌ డి ఉద్యోగార్థుల నుంచి లాలూ కుటుంబ సభ్యులు నాలుగు స్థలాలను రూ.7.5 లక్షలకు కొన్నదని తెలిపింది. వీటిని లాలూ భార్య రబ్రీదేవి.. ఆర్జేడీ ఎమ్మెల్యే సయ్యద్‌ అబు దొజానాకు రూ.3.5 కోట్లకు విక్రయించారని ఆరోపించింది. అనంతరం పెద్దమొత్తంలో నగదు తేజస్వీ ఖాతాలోకి వెళ్లిందని పేర్కొంది. లాలూ హయాంలో పలు రైల్వే జోన్లలో నియమితులైనవారిలో 50 శాతంపైగా మంది వారి కుటుంబ నియోజకవర్గాలకు చెందినవారేనని ఈడీ తెలిపింది. కాగా, ఈ కుంభకోణంలో శనివారం తేజస్వీ యాదవ్‌ సీబీఐ విచారణకు హాజరు కాలేదు. గర్భిణి అయిన తన భార్య రేచల్‌ ఆస్పత్రిలో ఉండడమే దీనికి కారణమని ఆర్జేడీ వర్గాలు పేర్కొన్నాయి. ఈడీ శుక్రవారం 12 గంటలు విచారించడంతో బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరారని చెప్పాయి. కాగా, తాము మళ్లీ పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందునే.. ఐదేళ్ల అనంతరం అకస్మాత్తుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయని బిహార్‌ సీఎం నితీశ్‌ విమర్శించారు. 2017లో జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్న సంగతిని గుర్తుచేశారు.

Updated Date - 2023-03-12T03:50:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising