ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: స్లీప్‌ మోడ్‌లోకి ల్యాండర్‌, రోవర్‌

ABN, First Publish Date - 2023-09-03T03:21:34+05:30

చంద్రుడిపై 100మీటర్లు ప్రయాణించిన ప్రజ్ఞాన్‌శ్రీహరికోట/న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: సూర్యుడిపై అధ్యయనానికి చేపట్టిన ఆదిత్య-ఎల్‌1 తన ప్రయాణాన్ని ప్రారంభించిన

రాత్రిని తట్టుకోవడానికి వీలుగా ప్రక్రియ: ఇస్రో

చంద్రుడిపై 100మీటర్లు ప్రయాణించిన ప్రజ్ఞాన్‌శ్రీహరికోట/న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: సూర్యుడిపై అధ్యయనానికి చేపట్టిన ఆదిత్య-ఎల్‌1 తన ప్రయాణాన్ని ప్రారంభించిన రోజే జాబిల్లిపై పరిశోధనలు సాగిస్తున్న చంద్రయాన్‌-3 మరో కీలక మైలురాయిని అధిగమించింది. ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై 100 మీటర్ల దూరం విజయవంతంగా ప్రయాణం పూర్తిచేసింది. ఇది మరింత ముందుకు వెళ్తున్నట్లు పేర్కొంటూ ఇస్రో శనివారం ట్వీట్‌ చేసింది. రోవర్‌ ప్రయాణించిన మార్గాన్ని చూపించే చిత్రాన్ని పోస్టు చేసింది. ‘‘ప్రజ్ఞాన్‌ 100 నాటౌట్‌’’ అని ఇస్రో పేర్కొంది.


మరోవైపు చంద్రుడిపై రాత్రి ప్రారంభమయ్యే సమయం అసన్నమైన నేపథ్యంలో ఇస్రో అప్రమత్తమైంది. అక్కడి రాత్రి వాతావరణాన్ని తట్టుకోవడానికి వీలుగా ల్యాండర్‌ను, రోవర్‌ను స్లీప్‌ మోడ్‌లోకి పంపింది. 14 రోజుల తర్వాత అవి తిరిగి పనిచేస్తాయని ఇస్రో పేర్కొంది. కాగా, చంద్రుడిపై ఒక పగలు 14 రోజులు ఉంటుంది. ఆ తర్వాత రాత్రి మరో 14 రోజుల పాటు సాగుతుంది. సోలార్‌ ప్యానెళ్ల ద్వారా శక్తిని పొందుతూ విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ పనిచేస్తాయి. ఒకసారి చీకటి పడితే అక్కడి ఉష్ణోగ్రత మైనస్‌ 180 డిగ్రీలకు పడిపోతుంది. ఈ సమయంలో ల్యాండర్‌, రోవర్‌ మనుగడ సాగించడం కష్టమే. అయితే, 14రోజుల తర్వాత చంద్రుడిపై తిరిగి సూర్యోదయం అయిన తర్వాత విక్రమ్‌, ప్రజ్ఞాన్‌, వాటిలోని పేలోడ్‌లు తిరిగి పనిచేసే అవకాశాలు చాలా స్వల్పం. ముఖ్యంగా విక్రమ్‌ యాక్టివేట్‌ అయితేనే భూమికి సంకేతాలు చేరతాయి.

Updated Date - 2023-09-03T06:45:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising