Sun Mission: సూర్యుడిపై అధ్యయనంలో కీలక ఘట్టం.. సౌర పవనాలను పరిశీలించిన ఆదిత్య ఎల్ 1
ABN, First Publish Date - 2023-12-02T13:04:54+05:30
సూర్యుడి(Sun Mission)పై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్(Aditya L1) సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. అది తాజాగా సౌర పవనాలపై అధ్యయనం ప్రారంభించింది. శాటిలైట్‌లో ఉన్న ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పరిమెంట్(ASPEX) పేలోడ్ సౌర గాలులపై స్టడీ ప్రారంభించింది.
ఢిల్లీ: సూర్యుడి(Sun Mission)పై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్(Aditya L1) సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. అది తాజాగా సౌర పవనాలపై అధ్యయనం ప్రారంభించింది. శాటిలైట్‌లో ఉన్న ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పరిమెంట్(ASPEX) పేలోడ్ సౌర గాలులపై స్టడీ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన రిపోర్ట్‌ని ఇస్రో(ISRO) రిలీజ్ చేసింది.
ప్రస్తుతం సోలార్ పేలోడ్ ఆపరేషన్స్ సక్రమంగా నిర్వహిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. ASPEXలో రెండు పరికరాలు ఉన్నాయి. అవి సోలార్ విండ్ ఐయాన్ స్పెక్ట్రోమీటర్, సుప్రా థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్. సెప్టెంబరు 2న ఏపీలోని శ్రీహరికోట నుండి ఆదిత్య ఎల్ 1 మిషన్ ని ప్రయోగించారు. సూప్రా థర్మల్ పరికరం సెప్టెంబర్ 10వ తేదీ నుంచి వర్కింగ్‌లోకి వచ్చింది.
ఐయాన్ స్పెక్ట్రోమీటర్ శనివారమే తన పని ప్రారంభించింది. స్పెక్ట్రోమీటర్ పనితీరు బాగానే ఉందని ఇస్రో చెప్పింది. ఆదిత్య పేలోడ్ పరికరం తీసిన ఫోటోను ఇస్రో తన ఎక్స్(X) అకౌంట్‌లో షేర్ చేసింది. ప్రొటాన్, ఆల్ఫా పార్టికల్స్‌లో ఉన్న ఎనర్జీ తేడాలను ఈ ఫోటోలో గమనించవచ్చు.
రెండు రోజుల్లో ప్రోటాన్, ఆల్ఫా పార్టికల్ కౌంట్‌లో తేడా ఉన్నట్లు ఆదిత్య శాటిలైట్ గుర్తించినట్లు తెలుస్తోంది. భారత్ 2025లో తొలిసారిగా అంతరిక్షంలోకి వ్యోమగాములను ప్రవేశపెట్టే పనిలో ఉంది.
Updated Date - 2023-12-02T13:05:30+05:30 IST