ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lashkar-e-Taiba: దీపావళి రోజున ఆ రైల్వే స్టేషన్లను బాంబులతో లేపేస్తాం.. లష్కరే తోయిబా నుంచి బెదిరింపు లేఖ

ABN, First Publish Date - 2023-10-26T21:50:35+05:30

26/11 దాడులకు కారణమైన లష్కరే తోయిబా నుంచి తాజాగా ఓ బెదిరింపు లేఖ వచ్చింది. యమునానగర్-జగాద్రి రైల్వే స్టేషన్‌కు పంపిన ఆ లేఖలో.. దీపావళి రోజున తాము హర్యానాలోని యమునానగర్‌, అంబాలా, పానిపట్‌తో...

26/11 దాడులకు కారణమైన లష్కరే తోయిబా నుంచి తాజాగా ఓ బెదిరింపు లేఖ వచ్చింది. యమునానగర్-జగాద్రి రైల్వే స్టేషన్‌కు పంపిన ఆ లేఖలో.. దీపావళి రోజున తాము హర్యానాలోని యమునానగర్‌, అంబాలా, పానిపట్‌తో పాటు పలు రైల్వేస్టేషన్లను బాంబులతో లేపేస్తామని ఆ ఉగ్రవాద సంస్థ పేర్కొంది. ఆ లేఖలో పాకిస్థాన్ జిందాబాద్ అని కూడా రాసి ఉంది. దీంతో.. భద్రతా సంస్థలు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ లేఖలో పేర్కొన్న రైల్వే స్టేషన్లకు భద్రతా దళాలను పంపించి.. తనిఖీలు నిర్వహిస్తున్నారు. వచ్చే, వెళ్లే ప్రయాణికులను తనిఖీ చేస్తున్నారు. తనిఖీలు చేయకుండా ఎవరినీ స్టేషన్లలోకి అనుమతించడం లేదు.


మరోవైపు.. ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అని తెలుసుకోవడం కోసం అధికారులు విచారణ చేపట్టారు. అయితే.. విచారణలో భాగంగా ఆ లేఖకు సంబంధించి నిర్దిష్టమైన సమాచారం అధికారులకు దొరకలేదు. ఆ లేఖపై ఉన్న స్టాంప్ సైతం ఏ పోస్టాఫీసు నుంచి వచ్చిందో స్పష్టంగా తెలియడం లేదు. ఈ లేఖపై జగాద్రి రైల్వేస్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ విలాటి రామ్ మాట్లాడుతూ.. ఈ లేఖ హిందీలో రాసి ఉందని తెలిపారు. ఈ లేఖ నిజమై ఉండదని, ఇది వికృత చేష్టలా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కాగా.. హర్యానాలోని రైల్వే స్టేషన్లలో ఇలాంటి బెదిరింపు లేఖలు చాలాసార్లు వచ్చాయి. ఈ లేఖలు భద్రతా సంస్థలకు తలనొప్పిగా మారాయి.

అయితే.. ఈసారి దీపావళికి కొన్ని రోజుల ముందే ఈ లేఖ రావడంతో, అధికారులు దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. అలాగే.. ఈ వ్యవహారంలో ఒక వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అయితే.. అతనెవరనే వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఇది ఎవరో గందరగోళం వాతావరణం సృష్టించడం కోసం చేసిన వికృత పనినా? లేక నిజంగానే ఆ ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయా? అనే కోణంలో అధికారులు పూర్తి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-10-26T21:50:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising