ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anurag Thagur: ఉగ్రవాదం, భయాలను వ్యాప్తి చేస్తే అంతే...!

ABN, First Publish Date - 2023-04-23T15:34:54+05:30

ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని, చట్టం చాలా శక్తివంతమైనదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని, చట్టం చాలా శక్తివంతమైనదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్ అరెస్టుపై ఆయన స్పందించారు. గత మార్చి 18వ తేదీ నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న అమృత్‌పాల్‌ను మోగా జిల్లాలో పంజాబ్ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్టు చేశారు.

దీనిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ మాట్లాడుతూ, పరారీలో ఉన్న ఒక వ్యక్తి ఎంతకాలం తప్పించుకుని తిరగగలడు? చట్టం చాలా శక్తివంతమైనది. ఉగ్రవాదం, భయాలు వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది'' అని అన్నారు.

కాగా, తన అరెస్టుకు ముందు అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోని మోగాలో ఉన్న ఒక గురుద్వారాలో ప్రసంగించినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి రోడ్‌వాల్ గురుద్వారాకు అమృత్‌పాల్ వచ్చాడని, ఆయనే స్వయంగా పోలీసులకు సమాచారం పంపి, ఉదయం 7 గంటలకు లొంగిపోతానని సమాచారం ఇచ్చారని గురుద్వారాకు చెందిన సింగ్ సాహిబ్ జ్ఞానీ జస్బీర్ సింగ్ తెలిపారు. అయితే లొంగిపోలేదని, ఇంటెలిజెన్స్ ఐజీ నేతృత్వంలోని పోలీసులు గురుద్వారా చేరుకుని అరెస్టు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2023-04-23T15:34:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising