ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tasmac Liquor: మూడు రోజులూ మద్యంలో మునకే !

ABN, First Publish Date - 2023-01-19T11:42:50+05:30

సంక్రాంతి పండుగ సందర్భంగా వరుసగా వచ్చిన మూడు సెలవు దినాల్లో మందుబాబులంతా మద్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: సంక్రాంతి పండుగ సందర్భంగా వరుసగా వచ్చిన మూడు సెలవు దినాల్లో మందుబాబులంతా మద్యంలో మునిగి తేలారు. గత శుక్రవారం నుంచి ఆదివారం వరకూ రాష్ట్రంలోని టాస్మాక్‌ మద్యం దుకాణాలన్నీ జనంతో నిండిపోయాయి. దీంతో మద్యం దుకాణాల్లో అమ్మకాలు మూడింతలు పెరిగాయి. ముఖ్యంగా ఆదివారం సంక్రాంతి పండుగ రోజే రాష్ట్రమంతటా రూ.450 కోట్లకు పైగా మద్యం విక్రయించినట్లు టాస్మాక్‌ ఉన్నతాధికారులు తెలిపారు. ఇక ఈ నెల 13న రూ.150 కోట్లు, 14న రూ.250 కోట్లకు పైగా మద్యం విక్రయించారు. ఈ నెల 13 నుంచి 17 వరకు నాలుగు రోజుల సంకాంత్రి సీజన్‌లో ఎట్టి పరిస్జితుల్లోనూ వెయ్యికోట్లకు తగ్గకుండా మద్యం విక్రయాలు జరగాలని టాస్మాక్‌ అధికారులు టార్గెట్‌ నిర్ణయించారు.

ఆ మేరకు మందుబాబులకు ‘లేదు’ అని చెప్పకుండా వారికి నచ్చిన సరకు దుకాణాల్లో నింపివేశారు. అధికారుల అంచనా ప్రకారమే గత నాలుగు రోజులుగా మద్యం దుకాణాల్లో అమ్మకాలు రాకెట్‌వేగంతో సాగుతున్నాయి. నగరాల్లో ఉదయం పది గంటలకు దుకాణాలు తెరవడానికి ముందే మందుబాబులు క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలో కానుం పండుగ సందర్భంగా మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకూ మద్యం దుకాణాలన్నీ మందుబాబులతో కిటకిటలాడాయి.

Updated Date - 2023-01-19T11:46:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising