ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Live Parasitic Worm: ఇలా జరగడం ప్రపంచంలో తొలిసారి.. ఓ 64 ఏళ్ల మహిళ మెదడులో..

ABN, First Publish Date - 2023-08-29T17:20:16+05:30

మానవ మెదడులో ఏకంగా 8 సెంటిమీటర్ల పొడవున్న ఏలిక పాము (roundworm) ఉందంటే నమ్మశక్యమా?. అందునా అది బతికే ఉంటే?.. వింటుంటూనే ఒళ్లు జలధరించేలా ఉన్నప్పటికీ ఆస్ట్రేలియాలో అచ్చం ఇదే ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ మెదడులో ఏకంగా 8 సెంటిమీటర్ల పొడవు, బతికున్న ఏలికపామును వైద్యులు గుర్తించారు. వైద్యశాస్త్రంలో ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి.

సిడ్నీ: మానవ మెదడులో ఏకంగా 8 సెంటిమీటర్ల పొడవున్న ఏలిక పాము (roundworm) ఉందంటే నమ్మశక్యమా?. అందునా అది బతికే ఉంటే?.. వింటుంటూనే ఒళ్లు జలధరించేలా ఉన్నప్పటికీ ఆస్ట్రేలియాలో అచ్చం ఇదే ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ మెదడులో ఏకంగా 8 సెంటిమీటర్ల పొడవు, బతికున్న ఏలికపామును వైద్యులు గుర్తించారు. వైద్యశాస్త్రంలో ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి.

కాగా సదరు మహిళలో జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఒత్తిడి వంటి లక్షణాలు కనిపించాయని వైద్యులు తెలిపారు. ‘ది గార్డియన్’ రిపోర్ట్ ప్రకారం.. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌కు చెందినవారని, ఆమె వయసు 64 సంవత్సరాలని పేర్కొంది. తొలుత పొత్తి కడుపులో నొప్పి, డయేరియాతో బాధపడుతూ జనవరి 2021లో స్థానిక హాస్పిటల్‌లో బాధిత మహిళ చేరింది. ఆ తర్వాత పొడిదగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు స్థిరంగా కొనసాగాయి. 2022 నాటికి లక్షణాల జాబితాలో మతిమరుపు, ఒత్తిడి చేరడంతో ఆమె రాజధానిలోని కాన్‌బెర్రా హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. అక్కడ ఎంఆర్ఐ స్కాన్ చేయగా మెదడు అసాధారణ స్థితిని వైద్యులు గుర్తించారు.


సర్జరీ నిర్వహించాల్సిన అవసరం ఉందని భావించారు. నిజానికి సర్జరీ నిర్వహించడానికి ముందు బ్రెయిన్‌లో ఏలికపాము ఉంటుందని భావించలేదని కాన్‌బెర్రా హాస్పిటల్ ఇన్ఫెక్షన్ వ్యాధుల వైద్యుడు డాక్టర్ సంజయ సేననాయకే చెప్పారు. సాధారణంగా న్యూరాలజిస్టులు మెదడులో ఇన్ఫెక్షన్లకు సంబంధించిన కేసులను పరిశీలిస్తుంటారన్నారు. కానీ వైద్య వృత్తిలో ఒకే ఒక్కసారి ఎదురయ్యే ఘటన ఇదని అన్నారు. ఏలికపాము ఉంటుందని తమలో ఏ ఒక్కరూ అనుకోలేదని అన్నారు. మెడికల్ హిస్టరీలో అరుదైన కేసు అని సంజయ సేననాయకే వ్యాఖ్యానించారు. సర్జరీ ద్వారా బయటకు తీసిర ఏలికపాము బతికే ఉందని, పరీక్షల నిమిత్తం దానిని నేరుగా లేబోరేటరీ తీసుకెళ్లామని తెలిపారు.

Updated Date - 2023-08-29T17:20:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising