Lakshadweep MP Muhammad Faisal: లక్షద్వీప్ ఎంపీ ఫైజల్‌పై అనర్హత వేటు ఉపసంహరణ
ABN, First Publish Date - 2023-03-29T11:13:37+05:30
లక్షద్వీప్ ఎంపీ ముహమ్మద్ ఫైజల్‌పై అనర్హత వేటును లోక్‌సభ బుధవారం ఉపసంహరించుకుంది....
న్యూఢిల్లీ: లక్షద్వీప్ ఎంపీ ముహమ్మద్ ఫైజల్‌పై అనర్హత వేటును లోక్‌సభ బుధవారం ఉపసంహరించుకుంది.(Lok Sabha withdraw)ఈ మేరకు లక్షద్వీప్ ఎంపీ ముహమ్మద్ ఫైజల్‌పై(Lakshadweep MP Muhammad Faisal) అనర్హత వేటును ఉపసంహరించుకుంటూ లోక్‌సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. తన అనర్హతకు వ్యతిరేకంగా ఫైజల్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా లోక్‌సభ సెక్రటేరియట్ అత్యవసర సర్క్యులర్ జారీ చేసింది.గతంలో కావరాతి కోర్టు తీర్పు నేపథ్యంలో ఫైజల్‌ను ఎంపీ పదవి నుంచి తొలగిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ చర్య ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొంటూ ఫైజల్ లోక్‌సభ కార్యదర్శిపై కోర్టు ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఇది కూడా చదవండి : Rahul Gandhis house:నా ఇల్లు రాహుల్ గాంధీకి అంకితం...వరణాసి కాంగ్రెస్ నేత పోస్టర్
విచారణ పెండింగ్‌లో ఉండగానే ఎంపీ అనర్హత వేటును ఉపసంహరించుకుంటూ లోక్‌సభ ఉత్తర్వులు జారీ చేసింది.కేరళ హైకోర్టు పైజల్ నేరం, శిక్ష పై స్టే విధించినా అనర్హత నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోని లోక్ సభ సచివాలయం వైఖరిపై ఫైజల్ సుప్రీంను ఆశ్రయించారు. పైజల్ పిటీషన్ ను సీజేఐ డివై చంద్రచూడ్ విచారణకు స్వీకరించిన నేపథ్యంలో లోక్ సభ సచివాలయం పైజల్ అనర్హతపై దిగొచ్చి, అనర్హత నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది.
Updated Date - 2023-03-29T11:13:37+05:30 IST