ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nitish Kumar: భారత్‌ను హిందూదేశంగా మార్చడమంటే..?: నితీష్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-02-17T15:19:00+05:30

భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలంటూ కొందరు చేస్తున్న డిమాండ్లపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుక్రవారంనాడు ఘాటుగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: భారతదేశాన్ని హిందూ దేశంగా (Hindu-Rashtra) మార్చాలంటూ కొందరు చేస్తున్న డిమాండ్లపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) శుక్రవారంనాడు ఘాటుగా స్పందించారు. ఎవరైనా ఇలాంటి డిమాండ్ చేస్తే ఆ వ్యక్తి దేశాన్ని ధ్వంసం చేయాలని కోరుకుంటున్నట్టేనని అన్నారు. పాట్నాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, భారదేశంలోని ప్రతి మతం వారు, జాతుల వారు కలిసి మెలిసి జీవిస్తున్నారని అన్నారు. ఎవరైనా హిందూదేశం కావాలని అంటున్నారంటే దేశాన్ని ధ్వంసం చేయాలని వారు కోరుకుంటున్నట్టు భావించవచ్చని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ చెప్పినదానినే మనం పాటించాలని, దురదృష్టవశాత్తూ ఆయన హత్యకు గురయ్యారని అన్నారు. గాంధీజీ మార్గాన్నే తాము అనుసరిస్తున్నామని చెప్పారు. కేంద్రం ఏమి కోరుకుంటుందో చూడాలని, వారు కూడా అదే డిమాండ్‌తోనే ముందుకు వెళ్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.

బీబీసీ కార్యాలయపై ఐ-టీ సర్వేలపై నితీష్ మాట్లాడుతూ, వారికి (మోదీ ప్రభుత్వానికి) ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్లు తగిన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. అదే తమపై ఎవరు ఎలాంటి రాతలు రాసినా, మాట్లాడినా వాళ్లను మాత్రం కేంద్రం పట్టించుకోదని అన్నారు. బీబీసీకి విస్తృతమైన నెట్‌వర్క్ ఉందని, చాలాకాలంగా వారు ప్రతి చోట నుంచి పనిచేస్తున్నారని, వారి పనితీరుకు ఫలితమే ఐ-టీ చర్య అయితే, ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించానా ఫలితం ఇదేనని చెప్పడమే అవుతుందని నితీష్ అన్నారు. మీడియా ప్రతికూల వార్తలను తాను ఎప్పుడూ ఒక సమస్యగా చూడలేదని, పనిచేయడంపైనే తనకు నమ్మకమని, ప్రజలే సుప్రీం అని చెప్పారు.

ఇదేమీ వాజ్‌పేయి ప్రభుత్వం కాదు..

అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలన్న డిమాండ్‌పై కేంద్ర అనుసరిస్తున్న వైఖరిపై నితీష్ కుమార్ మాట్లాడుతూ, ఇదేమీ అటల్ బిహారీ వాజ్‌పేయి శకం కాదని అన్నారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయి విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలను సావధానంగా వినేవారని చెప్పారు. కనీసం విపక్షాలకు గౌరవం అయినా ఇచ్చేవారని అన్నారు. ఆ పరిస్థితి ఇప్పుడే లేదన్నారు.

Updated Date - 2023-02-17T15:35:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising