Viral News: వారు ఒకప్పుడు బాత్రూం లో కూర్చొని ఏడ్చారు.. పూట గడవని పరిస్థితులనుంచి ఎలా గట్టెక్కారంటే..
ABN, First Publish Date - 2023-06-02T18:19:43+05:30
ఓ కొడుకు తన తల్లి చిరకాల కోరికను నెరవేర్చిన హార్ట్ టచ్చింగ్ స్టోరి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: తల్లిదండ్రులు కుటుంబం కోసం ఎంత కష్ట పడతారో చూస్తుంటాం. పిల్లల పోషణ, ఇతర బాధ్యతల నిర్వహణలో తమ కోరికలను సైతం పక్కనబెట్టి పనిచేస్తుంటారు. బాధ్యతలతో నిత్యం బిజీగా ఉండే వారి కలలు కల్లలుగానే మిగిలిపోతాయి. అయితే ఇక్కడ ఓ కొడుకు తన తల్లి చిరకాల కోరికను నెరవేర్చిన హార్ట్ టచ్చింగ్ స్టోరి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
పంజాబ్‌లోని లుథియానాకు చెందిన ఆయూష్ గోయల్..ట్విట్టర్ బ్లాగ్ ద్వారా మంచి సంపాదన పొందుతున్న కాపీరైటర్. గతంలో తన తల్లి కుటుంబం కోసం పడ్డ కష్టం నుంచి విముక్తి కలిగించి ఆమె చిరకాల కోరికను నెరవేర్చాడు. తన తల్లి కళ్లలో ఆనందాన్ని చూపిస్తూ ట్విట్టర్‌లో ఆమె ఫొటోలను పోస్ట్ చేశాడు.
చిన్నప్పటినుంచి తన కుటుంబం కోసం నెలకు 5వేల సంపాదనతో పడ్డ కష్టాన్ని ఆయూష్ నెటిజన్లకు షేర్ చేశాడు. ఒకానొక సందర్భంలో ఇళ్లు గడిచేందుకు, కాలేజీ ఫీజులు కట్టేందుకు డబ్బులు లేక బాత్ రూంలో కూర్చొని తన తల్లి ఏడ్చిన సందర్భాన్ని ఆయూష్ గుర్తు చేసుకున్నాడు. ఓ తల్లిగా, ఇల్లాలిగా జీవితం గడపాలని తన కోరిక అంటూ అప్పుడప్పుడు తల్లి చెప్పిన మాటలను నెరవేర్చాలని ఆయూష్ కష్టపడి చదివాడు. ట్విట్టర్ బ్లాగ్‌లో మంచి సంపాదనతో తల్లి చిరకాల కోరికను నెరవేర్చాడు. ఒకప్పుడు పనిచేస్తున్న తల్లి ఫొటో ఒకవైపు, మరోవైపు కల నెరవేరిన గర్వంతో ఉన్న తల్లి ఫొటోను ఆయూష్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ట్విట్టర్ నా జీవితాన్నే కాదు.. మా అమ్మ కలను కూడా నెరవేర్చింది అని రాశాడు.
ఆయూష్ గోయల్ షేర్ చేసిన ఈ హార్ట్ టచ్చింగ్ ట్వీట్ ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. గోయల్ సక్సెస్ ఫుల్ స్టోరీ స్పూర్తిదాయకం, అద్భుతమైందని రీట్వీట్ చేశారు. ‘‘చాలా స్ఫూర్తిదాయకమైన పోస్ట్, ఆయూష్ పనితనం అద్భుతం.ఇలాగే మెయింటెన్ చేయి’’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ‘‘ ఆయూస్ కథను వినగానే కళ్లకు నీళ్లొచ్చాయి. అద్భుతం. ఇంకా శక్తివంతం కావాలి. నీ జెర్నీని కొనసాగించు’’ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
‘‘ప్రేమను వ్యక్తం చేసేందుకు ఇంతకంటే మంచి మార్గం లేదు.. ఇలాగే కొనసాగించు..నీ తల్లిదండ్రులు చాలా గర్వపడతారు.’’ అని మరో నెటిజన్ రాశాడు. ‘‘చాలా అద్భుతం..నీ తల్లి కళ్లలో ఇప్పుడు ఎటువంటి కలతా కనిపించడం లేదు. మీ ఇద్దరికి కంగ్రాట్స్’’ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
అయూష్ గోయల్ షేర్ చేసిన వెంటనే ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంది. సుమారు 5 లక్షల వ్యూస్, 6వేల లైకులు వచ్చాయి.
Updated Date - 2023-06-02T18:19:43+05:30 IST