ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manipur crisis: ఇంఫాల్ ఈస్ట్‌లో మళ్లీ హింస.. 9 మంది మృతి

ABN, First Publish Date - 2023-06-14T13:16:17+05:30

రెండు వర్గాల మధ్య వైరంతో కుతకుతలాడుతున్న మణిపూర్‌లో శాంతి చర్యలకు మళ్లీ విఘాతం కలిగింది. మణిపూర్‌లోని ఈస్ట్ ఇంఫాల్‌లోని ఖమెన్‌లాక్ ప్రాంతంలో తిరిగి హింసాకాండ చెలరేగింది. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల్లో ఒక మహిళతో సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయపడ్డారు.

ఇంఫాల్: రెండు వర్గాల మధ్య వైరంతో కుతకుతలాడుతున్న మణిపూర్‌లో (Manipur) శాంతి చర్యలకు మళ్లీ విఘాతం కలిగింది. మణిపూర్‌లోని ఈస్ట్ ఇంఫాల్‌లోని ఖమెన్‌లాక్ ప్రాంతంలో తిరిగి హింసాకాండ (Violenve) చెలరేగింది. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల్లో ఒక మహిళతో సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు ఆ గ్రామానికి చేరుకున్నారు. తాజా హింసాకాండతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవల మణిపూర్‌లో పర్యటించడం ద్వారా పరిస్థితులు చక్కబడతాయని భావించిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

ఈస్ట్ ఇంపాల్ ఎస్పీ శివకాంత్ సింగ్ కథనం ప్రకారం, మిలిటెంట్లు అత్యాధునికి ఆయుధాలతో ఇంఫాల్ ఈస్ట్ సరిహద్దు జిల్లాలోని ఖమెలాక్ ప్రాంతంలోని గ్రామస్థులను మంగళవారం అర్ధారాత్రి ఒంటిగంట ప్రాంతంలో చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మెయితీల ఆధిపత్యం ఉన్న ఇంఫాల్ ఈస్ట్ జిల్లాకు, గిరిజన మెజారిటీ ఉన్న కాంగ్పోక్తి జిల్లాకు సరిహద్దు వెంబడి ఖమెలాక్ ప్రాంతం ఉంది. తాజా ఘటన అనంతరం ఇటీవల సడలించిన కర్ఫ్యూ ఆంక్షలను తిరిగి అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం మణిపూర్‌లోని 16 జిల్లాలకు 11 జిల్లాల్లో కర్ఫూ అమల్లో ఉంది. ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు.

చిచ్చు రేగిందిలా...

మెయితీలకు ఎస్‌టీ హోదా కల్పించాలనే నిర్ణయంతో రాష్ట్రంలో గత మే 3న అల్లర్లు మొదలయ్యాయి. చురా చాంద్ పూర్, తదితర జిల్లాలో హింస చెలరేగి 115 మంది మరణించగా, 50,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. హింసాకాండ విస్తరించడంతో కేంద్ర బలగాలను మణిపూర్‌లో మోహరించి, మరోవైపు శాంతి చర్చలకు కేంద్రం యత్నాలు సాగించింది. శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఈ కమిటీలో చేరడం లేదని మెయితీ-కుకీ వర్గాల్లోని సివిల్ సొసైటీ సంస్థ సభ్యులు ఇటీవల ప్రకటించారు. అమిత్‌షా స్వయంగా ఇటీవల నాలుగు రోజుల పాటు మణిపూర్‌లో మకాం వేసి శాంతియత్నాలు సాగించారు. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయితీలు ఉండగా, వీరు ఎక్కువగా ఇంఫాల్ వ్యాలీలో ఉంటున్నారు. గిరిజన నాగాలు, కులీల జనాభా 40 శాతం ఉండగా, వీరిలో ఎక్కువ మంది కొండప్రాంత జిల్లాల్లో నివసిస్తు్న్నారు.

Updated Date - 2023-06-14T14:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising