ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manish sidodia: సిసోడియా ఇంటికి చేరేసరికే ఆసుపత్రిలో చేరిన ఆయన భార్య

ABN, First Publish Date - 2023-06-03T14:11:13+05:30

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి మనీస్ సిసోడియా భార్య ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆమెను ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రిలో చేర్చారు. హైకోర్టు అనుమతితో సిసోడియాను జైలు నుంచి ఇంటికి అధికారులు శనివారం ఉదయం తీసుసువెళ్లారు. అయితే, అప్పటికే ఆనారోగ్యం కారణంగా ఆయన భార్య ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో అరెస్టయి తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీస్ సిసోడియా (Manish sisodia) భార్య ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆమెను ఎల్ఎన్‌జేపీ (LNJP) ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. ఢిల్లీ హైకోర్టు అనుమతితో సిసోడియాను జైలు నుంచి ఇంటికి అధికారులు శనివారం ఉదయం తీసుసువెళ్లారు. అయితే, అప్పటికే ఆనారోగ్యం కారణంగా ఆయన భార్య ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. లిక్కర్ స్కామ్‌లో సిసోడియా మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన అధికారిక నివాసాన్ని ఢిల్లీ మంత్రి అతిషికి కేటాయించారు. అస్వస్థతతో ఉన్న సిసోడియా భార్య అక్కడే ఉండటంతో ఆయనను పోలీసులు ఉదయం తీసుకువెళ్లారు. అప్పటికే ఆయన భార్య ఆసుపత్రిలో చేరారు. దాంతో ఆయనను అధికారులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడే తన భార్యను, కుటుంబ సభ్యులను ఆయన కలుసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు సిసోడియా తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.

సిసోడియాను అనారోగ్యంతో ఉన్న భార్యను చూసేందుకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం అనుమతించింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల మధ్య ఆయనను ఇంటికి తీసుకువెళ్లాలని తీహార్ జైలు సూపరింటెండెంట్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. దీనికి ముందు, తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని కోర్టును సిసోడియా కోరారు. జస్టిస్ శర్మతో కూడిన బెంచ్ అందుకు నిరాకరించింది. అయితే భార్యను చూసేందుకు ఇంటికి తీసుకు వెళ్లాలని అధికారులను ఆదేశించింది. ఆ సమయంలో ఆయన మొబైల్ ఫోన్ వాడరాదని, మీడియాతో మాట్లాడరాదని సూచనలు చేసింది. సిసోడియా భార్య మెడికల్ రిపోర్టును కూడా తమకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

Updated Date - 2023-06-03T15:05:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising