Landslides: అరుణాచల్ ప్రదేశ్‌లో విరిగిపడిన కొండచరియలు.. ప్రమాదంలో మెగా పవర్ ప్రాజెక్ట్
ABN, First Publish Date - 2023-10-28T13:46:36+05:30
ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలను ప్రకృతి విపత్తులు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా అక్కడ కొండ చరియలు విరిగిపడటంతో మెగా పవర్ ప్రాజెక్ట్(Mega Hydal Power Project) ప్రమాదంలో పడింది.
గువాహటి: ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలను ప్రకృతి విపత్తులు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా అక్కడ కొండ చరియలు విరిగిపడటంతో మెగా పవర్ ప్రాజెక్ట్(Mega Hydal Power Project) ప్రమాదంలో పడింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్(Arunachalpradesh)లో నిర్మాణంలో ఉన్న ఓ డ్యాంపై నిన్న అకస్మాత్తుగా కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో 2 వేల మెగా వాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి చేసే మెగా ప్రాజెక్ట్ ప్రమాదంలో పడినట్లైంది. దీంతో అస్సాంలోని సుబంగిరి నదీ ప్రవాహం తగ్గింది. డ్యాం నుంచి 300 మీటర్ల దూరంలో కొండ చరియల భాగాలు పడిపోయాయి. సిక్కింని ఇటీవలే భారీ వర్షాలు, వరదలు అల్లకల్లోలం చేశాయి.
వాటి ప్రభావంతో నదీ తీర ప్రాంతాల్లో ఉన్న చాలా మంది ప్రజలు వరదల్లో కొట్టుకుపోయారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని డ్యామ్ దిగువన అస్సాంలోని లఖింపూర్ జిల్లాలో సైతం కొండచరియలు విరిగిపడటం అధికారులను ఆందోళనకు గురి చేసింది. నదుల్లో చేపలు పట్టడం, ఈత కొట్టడం, బోటింగ్ వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం ప్రజలను ఆదేశించింది. ఇవాళ సాయంత్రం నాటికి నది సాధారణ ప్రవాహానికి చేరుకుంటుందని NHPC తెలిపింది.గతంలో కొండచరియలు విరిగిపడటంతో నాలుగు మళ్లింపు సొరంగాలు మూసుకుపోయాయి. అవి ప్రస్తుతం వినియోగంలో లేవు. నిర్మాణ సమయంలో నది నీటిని మళ్లించడానికి ఈ మళ్లింపు సొరంగాలు ఉపయోగపడతాయి. గడిచిన మూడేళ్లలో ప్రాజెక్టు నిర్మాణంపై 4 సార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. 2005లో ప్రాజెక్టుని ప్రారంభించినప్పటి నుంచి 2011,2019 లలో పనులు నిలిచిపోయాయి. దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.6,285 కోట్ల నుంచి రూ.20వేల కోట్లకు చేరుకుంది.
Updated Date - 2023-10-28T13:47:00+05:30 IST