Sanatana row: 'విద్వేష మెగా మాల్'ను తెరిచిన ఇండియా బ్లాక్: కేంద్ర మంత్రి
ABN, First Publish Date - 2023-09-15T17:36:22+05:30
సనాతన ధర్మంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ ) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం ముదురుతోంది. విపక్ష ఇండియా కూటమిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తాజా విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని కొందరు నేతలు చెబుతున్నారని, వాళ్లు 'విద్వేష మెగా మాల్' తెరిచారని విమర్శించారు.
న్యూఢిల్లీ: సనాతన ధర్మం (Sanatana Dharma)పై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం ముదురుతోంది. విపక్ష ఇండియా (I.N.D.I.A.) కూటమిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ (Anurag Thakur) తాజా విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని కొందరు నేతలు చెబుతున్నారని, వాళ్లు 'విద్వేష మెగా మాల్' (Mall of hate) తెరిచారని విమర్శించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో శుక్రవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 'ప్రేమదుకాణం' గురించి తనకు తెలియదని, అయితే కొందరు వ్యక్తులు 'విద్వేష మెగా మాల్' అయితే నిశ్చయంగా తెరిచారని చెప్పారు.
ఇండియా కూటమి నేతలు సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని చెబుతున్నారని, "విద్వేష మెగా మాల్'' తెరిచేందుకు వారికి రాహుల్ గాంధీ లైసెన్స్ ఇచ్చారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోందని అనురాగ్ ఠాకూర్ అన్నారు.
వివాదం ఇలా మొదలైంది..
డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్ఠాలిన్ ఒటీవల ఒక కార్యక్రమంలో సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సామాజిక న్యాయానికి సనాతన ధర్మం వ్యతిరేకమని, సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలని ఆయన అన్నారు. సనాతన ధర్మాన్ని ప్లేగు వంటి వ్యాధులతో పోల్చారు. దీనిపై బీజేపీతో సహా పలు హిందూసంస్థల నుంచి తీవ్ర వివాదం వ్యక్తమైంది.
గర్విష్టుల కూటమి..
సనాతన ధర్మాన్ని ఆక్షేపిస్తుండటంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారంనాడు మధ్యప్రదేశ్‌లో జరిగిన కార్యక్రమంలో తొలిసారి స్పందించారు. విపక్ష 'ఇండియా' కూటమిని గరిష్టులతో పోల్చారు. సనాతన ధర్మాన్ని ధ్వంసం చేసి దేశాన్ని వేలాది సంవత్సరాల క్రితం నాటి బానిసత్వంలోకి నెట్టాలని చూస్తున్నారని అన్నారు. ''అహంకారుల కూటమి ఇటీవల ముంబైలో సమావేశమైంది. వారికి ఎలాంటి విధానాలు కానీ, అంశాలు కానీ, నాయకుడు కానీ లేరు. సనాతన ధర్మంపై దాడి చేసి, ధ్వంసం చేయాలనే రహస్య ఎజెండా మాత్రం ఉంది'' అని మోదీ విమర్శించారు.
Updated Date - 2023-09-15T17:37:44+05:30 IST