Metro pillar: మృత్యువై మీదపడ్డ మెట్రో పిల్లర్
ABN, First Publish Date - 2023-01-11T02:31:28+05:30
నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ మృత్యువులా మీద పడింది. తల్లితోపాటు రెండున్నరేళ్ల కుమారుడి ప్రాణాలను బలి తీసుకుంది.
తల్లీ, రెండున్నరేళ్ల కుమారుడు మృతి
తండ్రి, కుమార్తెకు తీవ్ర గాయాలు
బెంగళూరు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ మృత్యువులా మీద పడింది. తల్లితోపాటు రెండున్నరేళ్ల కుమారుడి ప్రాణాలను బలి తీసుకుంది. బెంగళూరులో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. గోవిందపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగవార వద్ద మెట్రో పనులు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తేజస్విని, లోహిత్‌కుమార్ దంపతులు తమ కవల పిల్లల (కుమారుడు, కుమార్తె)తో కలిసి ఆ దారిలో హోండా యాక్టివ్ బైక్‌పై వెళ్తుండగా మెట్రో పిల్లర్ కోసం ఇనుప చువ్వలతో ఏర్పాటు చేసిన భారీ పిల్లర్ వారిపై పడింది.
సుమారు 40 అడుగుల ఎత్తున్న ఈ పిల్లర్ బరువు కొన్ని టన్నుల్లో ఉండడంతో తేజస్విని (28), ఆమె కుమారుడు విహాన్ ఇనుపచువ్వల కింద నలిగిపోయారు. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. తేజస్విని, విహాన్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో లోహిత్, రెండున్నరేళ్ల కూతురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
Updated Date - 2023-01-11T02:31:29+05:30 IST