ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister: 15 రోజుల్లో 15వేల మంది ఉపాధ్యాయుల నియామకం

ABN, First Publish Date - 2023-01-20T11:08:14+05:30

నూతన విద్యావిధానాన్ని ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ప్రారంభిస్తామని అందుకు అనుగుణంగానే 15 రోజుల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జూన్‌ నుంచి అన్ని పాఠశాలల్లో నూతన విద్యావిధానం: మంత్రి నాగేష్‌

బెంగళూరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): నూతన విద్యావిధానాన్ని ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ప్రారంభిస్తామని అందుకు అనుగుణంగానే 15 రోజుల్లో 15వేల మంది ఉపాధ్యాయులను నియమిస్తామని ప్రాథమిక విద్యాశాఖా మంత్రి బీసీ నాగేష్‌(Minister BC Nagesh) వెల్లడించారు. గురువారం దక్షిణకన్నడ జిల్లా కుక్కె సుబ్రమణ్య పరిధిలోని బెళ్ళారె, కడబలలో వివిధ అభివృద్ధి పనులను ఆరంభించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇప్పటికే ఎంపిక చేసిన 400-500ల పాఠశాలల్లో కొత్త విద్యా పాలసీ అమలు చేస్తామన్నారు. 2023-24 విద్యాసంవత్సరం వేళ పూర్తీస్థాయిలో కొనసాగిస్తామని, ఎస్‌ఎ్‌సఎల్‌సీ, పీయూ వార్షిక పరీక్షలు యథావిధిగానే సాగుతాయని ఎటువంటి మార్పులు ఉండవని తేల్చి చెప్పారు. 15వేల మంది ఉపాధ్యాయులను నియమించుకునేందుకు అర్హతా పరీక్షలు ముగిశాయన్నారు. న్యాయపరమైన సమస్యలు తలెత్తిన మేరకు కొంత వాయిదా పడిందన్నారు. గత ఐదేళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా 3,517 పాఠశాల గదులను మాత్రమే నిర్మించారని 5,600 గదులకు మరమ్మత్తులు చేశారన్నారు. మూడేళ్ళ బీజేపీ పాలనలో 22వేల కొత్తగదుల నిర్మాణాలతో పాటు లక్ష గదులకు మరమ్మత్తులు చేపట్టామన్నారు. 34వేల మంది అతిథి ఉపాధ్యాయులను నియమించి వారికి వేతనాలు పెంచామన్నారు. కార్యక్రమంలో మంత్రి అంగారతో పాటు విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-20T11:08:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising