ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister: ఇకనుంచి ఎన్‌ఈపీ కాదు.. ఎస్‌ఈపీ అమలు చేస్తాం: మంత్రి

ABN, First Publish Date - 2023-06-21T13:19:38+05:30

రాష్ట్రంలో నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఈపీ) కాకుండా స్టేట్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎస్‌ఈపీ)ని అమలు చేస్తామని ఉన్నత విద్యాశాఖ మంత్రి

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఈపీ) కాకుండా స్టేట్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎస్‌ఈపీ)ని అమలు చేస్తామని ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఎంసీ సుధాకర్‌(Higher Education Minister Dr. MC Sudhakar) వెల్లడించారు. కలబురగిలో సోమ వారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండేళ్లక్రితం ఎన్‌ఈపీని అమలు చేశారన్నారు. తద్వారా ఉన్నత విద్యలో చదువుకు కొంత సమస్య ఏర్పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారన్నారు. అందుకే విద్యార్థుల చదువుకు ఎటు వంటి భంగం కలగకుండా ఉండాలనే విద్యానిపుణుల సభ ఏర్పాటు చేసి సాధక బాధకాలపై చర్చించదలిచామన్నారు. స్టేట్‌ ఎడ్యుకేషన్‌ పాలసీని రూపొందించి వాటిని అమలు చేయదలిచామన్నారు. విద్యలో గుణాత్మకత, నైపుణ్యత విషయంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బోధనలతోపాటు విద్యార్థులకు నైపుణ్యత ముఖ్యమన్నారు. విద్యారంగానికి ఆరుశాతం బడ్జెట్‌లో గ్రాంటు కేటాయిం చారని, ఇందులో ఉన్నతవిద్యకు 1.70శాతం మాత్రమే లభిస్తుందన్నారు. 88శాతం వేతనాలు, మౌలిక సదుపాయాలకే సరిపోనుందన్నారు. రాష్ట్రంలో 32 ప్రభుత్వ యూని వర్సిటీలు ఉన్నాయని 15వేలమంది గెస్ట్‌ లెక్చరర్స్‌ పనిచేస్తున్నారన్నారు. బుధవారం అన్ని కళాశాలల్లోనూ యోగా డే ఆచరిస్తామన్నారు.

Updated Date - 2023-06-21T13:19:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising