Nehru Memorial : ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ పేరు మార్చేసిన మోదీ.. నేటి నుంచి అమల్లోకి కొత్త పేరు..
ABN, First Publish Date - 2023-08-16T13:25:41+05:30
నెహ్రూ పేరును ప్రధాని మోదీ తొలగించారు. ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ పేరును ప్రధానమంత్రుల స్మారకచిహ్నంగా మోదీ ప్రభుత్వం మార్చి వేసింది. నేటి నుంచి కొత్త పేరు అమలులోకి రానుంది. నెహ్రూ మరణానంతరం ఆయన నివాసాన్ని స్మారకచిహ్నంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం మార్చింది.
ఢిల్లీ : నెహ్రూ పేరును ప్రధాని మోదీ తొలగించారు. ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ పేరును ప్రధానమంత్రుల స్మారకచిహ్నంగా మోదీ ప్రభుత్వం మార్చి వేసింది. నేటి నుంచి కొత్త పేరు అమలులోకి రానుంది. నెహ్రూ మరణానంతరం ఆయన నివాసాన్ని స్మారకచిహ్నంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం మార్చింది. 14 ప్రధాన మంత్రుల సేవలను గుర్తు చేస్తూ ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని మోదీ ప్రభుత్వం అక్కడే నిర్మించింది. నెహ్రూ మెమోరియల్ పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. నెహ్రూ వారసత్వాన్ని తిరస్కరించడం, వక్రీకరించడం, పరువు తీయడం, నాశనం చేయడమే మోదీ అనే సింగిల్ పాయింట్ అజెండా అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మండి పడ్డారు.
Updated Date - 2023-08-16T13:25:41+05:30 IST