ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Operation Ajay: ప్రతి భారతీయుడ్ని సురక్షితంగా తీసుకొస్తాం.. ఈ ఆపరేషన్ భారత్‌కు గర్వకారణం

ABN, First Publish Date - 2023-10-13T21:42:28+05:30

ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ను మొదలుపెట్టింది. ఇప్పటికే...

ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ ఆపరేషన్‌లో భాగంగా ఒక ప్రత్యేక విమానం 212 భారతీయుల్ని తీసుకొని ఢిల్లీకి చేరుకుంది. ఈ సందర్భంగా.. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడ్ని సురక్షితంగా తీసుకొస్తుందని భారత్ గ్యారెంటీ ఇస్టుందని, ఎందుకంటే మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం బలంగా ఉందని పాలక బీజేపీ శుక్రవారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గౌరవ్ భాటియా మాట్లాడుతూ.. హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు జరుగుతున్న తరుణంలో భారత ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకుంటోందన్నారు. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ప్రత్యేక విమానంలో 212 మంది భారతీయులను సురక్షితంగా వెనక్కు తీసుకొచ్చారని, ఇది మొత్తం భారతదేశానికే గర్వకారణమని అన్నారు. దీన్ని ఒక అపూర్వమైన రెస్క్యూ మిషన్‌గా అభివర్ణించారు. కష్టకాలంలో కూడా ప్రజల కోసం 24x7 పని చేసే సామర్థ్యం, ఓపిక కలిగి ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది కేవలం మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రమేనని చెప్పడానికి ఈ విజయవంతంమైన ఆపరేషన్ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంది కాబట్టే.. ఇజ్రాయెల్ నుండి మొదటి బ్యాచ్ భారతీయులు సురక్షితంగా తిరిగొచ్చారన్నారు.


కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజా ప్రయోజనాలే ప్రధానమని.. దాని వెనుక 140 కోట్ల మంది భారతీయుల బలం ఉందని గౌరవ్ భాటియా పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తిస్తోందని ప్రతి పౌరుడు తెలుసుకోవాలన్నారు. అక్కడున్న భారతీయులు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడు సురక్షితంగా భారత్‌కి తిరిగొచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. యుద్ధంలో చిక్కుకున్న ప్రతి పౌరుడి భద్రతకు తాము భరోసా ఇస్తామని.. ఇది తమ కర్తవ్యమని.. దానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. వేగవంతమైన, సమర్థవంతమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆపరేషన్ అజయ్ అమలులో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

బలమైన సంకల్పం ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో బలమైన ప్రభుత్వం ఉందని గౌరవ్ భాటియా చెప్పుకొచ్చారు. నేడు భారత్ కేవలం స్వంత పౌరుల్ని రక్షించడమే కాకుండా ఇతర దేశాల పౌరులకు సంక్షోభ పరిస్థితులలో సహాయం చేస్తోందన్నారు. 2015లో ఆపరేషన్‌ రాహత్‌ కింద 67,000 మంది భారతీయులను యెమెన్‌ నుంచి సురక్షితంగా తీసుకొచ్చామని.. ఆపరేషన్‌ సంకట్‌ మోచన్‌ కింద సూడాన్‌ నుంచి 158 మంది భారతీయులతో పాటు ఇద్దరు నేపాలీలను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారని తెలిపారు. 2021లోనూ 800 మందికి పైగా భారతీయులు ఆఫ్ఘనిస్తాన్ నుండి సురక్షితంగా తిరిగొచ్చారు. గత సంవత్సరం ఆపరేషన్ గంగా కింద ఉక్రెయిన్ నుండి 22,500 మంది భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చారని కూడా ఆయన గుర్తు చేశారు.

ఏదైనా సంక్షోభం లేదా యుద్ధం లేదా మరేదైనా సంభవించినప్పుడు.. అన్ని దేశాలు భారత్‌ను ఒక స్టాండ్ కోసం మాత్రమే కాకుండా, పరిష్కారం కోసం కూడా చూస్తున్నాయని గౌరవ్ భాటియా తెలిపారు. ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యున్నత నాయకుడిగా అవతరించారని.. దీనిని ఎవరూ తిరస్కరించలేరని వాదించారు. ఇదే సమయంలో పాలస్తీనా ప్రజలకు విపక్షాలు మద్దతివ్వడంపై ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రధాని భారతదేశ వైఖరిని ప్రకటించినప్పుడు, అది ప్రతీ భారతీయుడి వాయిస్ అని చెప్పారు. భారత్‌ ఎప్పుడూ మానవత్వంతో నిలబడిన దేశమని.. భవిష్యత్తులో కూడా ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటున్న అమాయక ప్రజలకు అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2023-10-13T21:42:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising