ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PM Modi : కన్నీరు పెట్టిన మోదీ

ABN, First Publish Date - 2023-02-08T04:47:44+05:30

తుర్కియే, సిరియా దేశాల్లో భూకంప మృతులకు సంతాపం ప్రకటిస్తూ ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. 2001లో గుజరాత్‌లోని భుజ్‌లో వచ్చిన భూకంపంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: తుర్కియే, సిరియా దేశాల్లో భూకంప మృతులకు సంతాపం ప్రకటిస్తూ ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. 2001లో గుజరాత్‌లోని భుజ్‌లో వచ్చిన భూకంపంతో వేలమంది మృతి చెందిన విషాద ఘటనను గుర్తుచేసుకుని విషణ్ణ వదనులయ్యారు. పార్లమెంటులో బడ్జెట్‌ సమావేశాల్ని దృష్టిలో పెట్టుకుని మంగళవారం నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన తుర్కియే, సిరియా దేశాల్లో భూకంప మృతులకు సంతాపం ప్రకటించారు. తుర్కియేకు మానవతా సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. తుర్కియేలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండగా భుజ్‌ భూకంప సమయంలో ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో భుజ్‌ని 2001లో కుదిపేసిన భూకంపం వల్ల 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షన్నర మంది గాయపడ్డారు. అనేక వేలమంది నిరాశ్రయులయ్యారు. తుర్కియే, సిరియా దేశాల్లో భూకంపంతో వేలసంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. ఈశాన్య సిరియాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని సహాయక ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఇక్కడ ఇప్పటికే 4 మిలియన్లకు పైగా ప్రజలు మానవతా సాయంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నారు.

Updated Date - 2023-02-08T04:47:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising