Morgan Stanley : భారత్‌కు శుభవార్త, చైనాకు దుర్వార్త చెప్పిన మోర్గాన్ స్టాన్లీ
ABN, First Publish Date - 2023-08-03T11:19:37+05:30
ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) భారత దేశానికి తీపి కబురు చెప్పింది. ప్రధాన ఆసియా ఆర్థిక వ్యవస్థల రేటింగ్స్‌ను సవరిస్తూ, భారత దేశ రేటింగ్‌ను ‘ఓవర్ వెయిట్’ (overweight)కు అప్‌గ్రేడ్ చేసింది. అదే సమయంలో చైనాకు చేదు వార్త వినిపిస్తూ, ఆ దేశ రేటింగ్‌ను ‘ఈక్వల్ వెయిట్ (equal-weight)’కు డౌన్‌గ్రేడ్ చేసింది.
న్యూఢిల్లీ : ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) భారత దేశానికి తీపి కబురు చెప్పింది. ప్రధాన ఆసియా ఆర్థిక వ్యవస్థల రేటింగ్స్‌ను సవరిస్తూ, భారత దేశ రేటింగ్‌ను ‘ఓవర్ వెయిట్’ (overweight)కు అప్‌గ్రేడ్ చేసింది. అదే సమయంలో చైనాకు చేదు వార్త వినిపిస్తూ, ఆ దేశ రేటింగ్‌ను ‘ఈక్వల్ వెయిట్ (equal-weight)’కు డౌన్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి ఈ రేటింగ్స్ ఇచ్చింది.
భారత దేశ రేటింగ్‌ను ‘ఓవర్ వెయిట్’ (overweight)కు అప్‌గ్రేడ్ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. రిలేటివ్ వాల్యుయేషన్స్ అక్టోబరులో కన్నా తక్కువ తీవ్రతతో ఉన్నట్లు తెలిపింది. భారత దేశంలో అమలు చేస్తున్న సంస్కరణలు, సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ సుస్థిరత ఎజెండా వల్ల మూలధన వ్యయం, లాభాలు పటిష్టంగా ఉంటాయని అంచనా వేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పోర్ట్‌ఫోలియో ఫ్లోస్ సానుకూలంగా ఉన్నాయని, దీనికి కారణం భారత దేశం సంస్కరణలకు, సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కట్టుబడి పనిచేస్తుండటమేనని తెలిపింది.
చైనాకు చేదు వార్త
చైనా ఆర్థిక వ్యవస్థపై మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. చైనా ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించడం వల్ల ర్యాలీ జరుగుతోందని, జాగ్రత్తగా వ్యవహరించాలని పెట్టుబడిదారులను హెచ్చరించింది. లాభాలను స్వీకరించాలని సలహా ఇచ్చింది. చైనా ప్రభుత్వం క్రమంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని, అయితే ఇవి స్టాక్ మార్కెట్ లాభాలు స్థిరపడటానికి సరిపోవని తెలిపింది. లోకల్ గవర్నమెంట్ ఫైనాన్సింగ్ వెహికిల్ రుణం, స్థిరాస్తులు, లేబర్ మార్కెట్, భౌగోళిక, రాజకీయ అంశాలు వంటివి చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడాలని తెలిపింది. ఇవి ఫ్యూచర్ ఇన్‌ఫ్లోస్, రీ-రేటింగ్ పొటెన్షియల్‌లపై ప్రభావం చూపుతాయని వివరించింది.
ఇవి కూడా చదవండి :
Haryana clashes : హర్యానాలో మత ఘర్షణలు.. ప్రశాంతంగా ఉండాలన్న అమెరికా..
Gyanvapi : జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి
Updated Date - 2023-08-03T11:19:37+05:30 IST