Motherhood Hospitals: దేశవ్యాప్తంగా వర్చువల్ నియోనాటల్ ఐసీయూ నెట్‌వర్క్
ABN, First Publish Date - 2023-04-24T21:01:43+05:30
దేశంలోని ప్రముఖ విమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నెట్‌వర్క్ మదర్‌హుడ్ హాస్పిటల్స్
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ విమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నెట్‌వర్క్ మదర్‌హుడ్ హాస్పిటల్స్ (Motherhood Hospitals) దేశవ్యాప్తంగా 10 నగరాల్లో 21 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. తాజాగా ఇది రిమోట్ మానిటరింగ్ టెక్నాలజీ, సిస్టమ్ వర్చువల్ లైఫ్ సేవింగ్ కేర్ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (NICU) ఏర్పాటు చేసింది. ఎలాంటి సదుపాయాలు లేని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నర్సింగ్ హోంలు, ఆసుపత్రుల్లో చేరిన నవజాత శిశువులు ఈ సేవలను పొందొచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లోని నవజాత శిశువులకు సైతం నియోనాటల్ టెలీహెల్త్ సాంకేతికతను ఉపయోగించుకుని విభిన్న ప్రాంతాల్లో ఉండే అత్యున్నత నైపుణ్యం కలిగిన నియోనాటాలజిస్ట్‌లు, నర్సుల సహకారంతో సేవలను అందించవచ్చు. మొదటి దశలో భాగంగా బెంగళూరులోని తమ ఆసుపత్రిలో సెంట్రల్ కేర్ సెంటర్ (Hub)ను ఏర్పాటు చేసింది. దీనిని అనంతపురం, హిందూపూరం, మదనపల్లె, పాట్నా, హిసార్‌లలో ఉన్న ఐదు ఎన్‌ఐసీయూలతో అనుసంధానించింది.
ఈ సందర్భంగా మదర్‌హుడ్ హాస్పిటల్స్ సీఈవో విజయరత్న వెంకట్రామన్ మాట్లాడుతూ.. విప్లవాత్మక నియో నాటల్ సొల్యూషన్స్‌ను తీసుకురావడంలో మదర్‌హుడ్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. దేశంలో మారుమూల ప్రాంతాలకు సైతం ఎన్‌ఐసీయూ సంరక్షణను చేరువచేయాలనే తమ ప్రయత్నాలకు ఇది నిదర్శమని పేర్కొన్నారు.
మదర్‌హుడ్ హాస్పిటల్స్ నియోనాటాలజిస్ట్, పిడియాట్రిషియన్ డాక్టర్ ప్రతాప్ చంద్ర మాట్లాడుతూ.. ఎన్‌ఐసీయూ లైవ్‌తో ఆసుపత్రిలో గడిపే సమయాన్ని గణనీయంగా తగ్గించగలమని భావిస్తున్నట్టు చెప్పారు. ఎన్‌ఐసీయూ లైవ్ వర్చువల్ నియో నాటాలాజీ కేర్ నెట్‌వర్క్ వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 1000 పడకలకు చేరుకోవచ్చని ఆపియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ విశాల్ బాలి అన్నారు.
Updated Date - 2023-04-24T21:01:43+05:30 IST