Salman Khan: సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన బిష్ణోయ్ అరెస్ట్
ABN, First Publish Date - 2023-03-26T19:54:17+05:30
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈమెయిల్ ద్వారా బెదిరించిన గ్యాంగ్‌స్టర్ ధకడ్‌రామ్ బిష్ణోయ్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Bollywood film actor Salman Khan) ఈమెయిల్ ద్వారా బెదిరించిన గ్యాంగ్‌స్టర్ ధకడ్‌రామ్ బిష్ణోయ్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై బాండ్రా అసిస్టెంట్ సబ్ ఇనెస్పెక్టర్ బజ్‌రంగ్ జగ్‌థాప్ రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో గ్యాంగ్‌స్టర్ ధకడ్‌రామ్ బిష్ణోయ్‌ను (Dhakadram Bishnoi) అరెస్ట్ చేశారు. రాజస్థాన్ పోలీసులతో కలిసి ఈ సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. 21 సంవత్సరాల ధకడ్‌రామ్ బిష్ణోయ్ గతంలో సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని కూడా బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు.
సల్మాన్‌కు బెదిరింపులపై ఈ నెల 18న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్(gangster) లారెన్స్ బిష్ణోయ్( Lawrence Bishnoi), గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్(Goldy Brar)లపై ముంబై పోలీసులు(Mumbai Police) ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సల్మాన్ సన్నిహితుడు ప్రశాంత్ గుంజాల్కర్(Prashant Gunjalkar) ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
సల్మాన్ కార్యాలయం ఈమెయిల్ ఐడీకి వచ్చిన మెయిల్‌లో సల్మాన్‌ను తమ బాస్ గోల్డీ బ్రార్ నేరుగా కలవాలనుకుంటున్నట్లు ఉంది. సల్మాన్‌ను చంపేస్తామనే బెదిరింపు అందులో ఉందని ప్రశాంత్ గుంజాల్కర్ పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సల్మాన్‌కు గతంలో కూడా అనేకసార్లు బెదిరింపులు వచ్చాయి. ధకడ్‌రామ్ బిష్ణోయ్ అరెస్ట్‌తో అతడి వెనుక ఉన్నవారెవరో కూడా తేలనుంది.
Updated Date - 2023-03-26T19:54:21+05:30 IST