ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nandana Deb sen: అమర్త్య సేన్ మృతి వార్తలను ఖండించిన కుమార్తె

ABN, First Publish Date - 2023-10-10T18:55:54+05:30

ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ క్షేమంగానే ఉన్నారని ఆయన కుమార్తె నందన దేబ్ సేన్ తెలిపారు. తమ తండ్రి మరణించారంటూ వచ్చిన వార్తలను ఖండించారు. ఈ వార్తలను నమ్మవద్దని కోరారు.

న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి (Nobel prize) గ్రహీత అమర్త్య సేన్ (Amarya sen) క్షేమంగానే ఉన్నారని ఆయన కుమార్తె నందన దేబ్ సేన్ (Nandana Deb Sen) తెలిపారు. తమ తండ్రి మరణించారంటూ వచ్చిన వార్తలను ఖండించారు. ఈ వార్తలను నమ్మవద్దని కోరారు. అమర్త్యసేన్ మరణించారంటూ కొన్ని జాతీయ, సోషల్ మీడియాలో వార్తలు రావడంతో నందన ఈ స్పష్టత ఇచ్చారు.


''ఫ్రండ్స్..మీ ఆందోళనకు థాంక్స్. కానీ ఆ వార్తలన్నీ అవాస్తవాలు. బాబా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. కేంబ్రిడ్జిలో వండ్రఫుల్ వీక్‌ను మేమంతా కుటుంబ సమేతంగా గడిపాం. గత రాత్రి నాన్నగారికి బై చెప్పగానే ఆయన ఎప్పటిలాగే మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. హార్వార్డ్‌లో వారంలో రెండు కోర్సులు నాన్నగారు బోధిస్తున్నారు. ఆయన తన పుస్తకాలతో చాలా బీజీగా ఉన్నారు'' అని నందన ఒక ట్వీట్‌లో తెలిపారు.


దీనికిముందు, అమర్త్యసేన్ మరణించారంటూ ఎకనామిక్స్‌లో 2023 సంవత్సరానికి నోబెల్ గెలుచుకున్న అమెరికా ఎకనామిక్ హిస్టారియన్ క్లాడియా గోల్డిన్ చేసిన ఒక ట్వీట్‌ సంచలనమైంది. నాకు అత్యంత ఆప్తులైన ప్రొఫెసర్ అమర్త్య సేన్ కొద్ది నిమిషాల క్రితమే మరణించినట్టు తెలిసిందని గోల్డిన్ ట్వీ్ట్ చేశారు. అయితే కొద్దిసేపటికే ఆ వార్తలో నిజం లేదని ధ్రువీకరణ అయింది.

Updated Date - 2023-10-10T18:56:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising