ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: ఎవ్వరికీ సాధ్యం కాని పనిని భారత్ చేసింది.. చంద్రయాన్-3 సక్సెస్‌పై నాసా అడ్మినిస్ట్రేటర్

ABN, First Publish Date - 2023-12-02T09:00:52+05:30

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతమైన విషయం అందరికీ తెలిసిందే. చంద్రుని దక్షిణ ద్రువంపై సేఫ్‌గా ల్యాండ్ అయ్యి.. 14 రోజుల పాటు అక్కడ పరిశోధనలు జరిపి..

Bill Nelson On Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతమైన విషయం అందరికీ తెలిసిందే. చంద్రుని దక్షిణ ద్రువంపై సేఫ్‌గా ల్యాండ్ అయ్యి.. 14 రోజుల పాటు అక్కడ పరిశోధనలు జరిపి.. భూమికి ఎంతో కీలకమైన సమాచారాన్ని అందజేసింది. భారత్ సాధించిన ఈ అద్భుత విజయంపై తాజాగా నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ స్పందించారు. ఇంతవరకూ ఏ దేశం చేయని పనిని భారత్ చేసిందని, ఈ సాధనకు భారత్ ప్రశంసలు అందుకోవడానికి అర్హమైనదని కొనియాడారు.

‘‘భారతదేశానికి నా అభినందనలు. మీరు చంద్రుని దక్షిణ ధృవంపై ముందుగా దిగారు. వచ్చే ఏడాది మా కమర్షియల్ ల్యాండర్ కూడా అదే ప్రాంతంలో ల్యాండ్ కానుంది. కానీ.. అక్కడ తొలిసారి అడుగు పెట్టింది మాత్రం ఇండియానే. దక్షిణ ద్రువంపై సాఫ్ట్ ల్యాండ్ చేసేందుకు ఇతర దేశాలు ప్రయత్నించాయి కానీ.. భారత్ మాత్రం విజయం సాధించింది. ఈ ఘనత సాధించినందుకు గాను భారత్ ప్రశంసలకు అర్హమైన దేశం. ఇది ఎంతో ముఖ్యమైనది’’ అని బిల్ నెల్సన్ చెప్పారు. ఇదే సమయంలో ఆయన NISAR మిషన్ గురించి కూడా ప్రస్తావించారు. మన భూమికి ఏం జరుగుతోందో తెలుసుకోవడం కోసం.. నాలుగు ప్రధాన అబ్జర్వేటరీల సాధనతో పూర్తి 3D మిశ్రమ నమూనాను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


‘‘భారత ప్రభుత్వంతో కలిసి మేము ఒక ప్రధాన అబ్జర్వేటరీని నిర్వహిస్తున్నాం. ఇందులో మొత్తం నాలుగు ప్రధాన అబ్జర్వేటరీలు ఉంటాయి. ఇప్పటికే 25 స్పేస్‌క్రాఫ్ట్ కక్షలో ఉంది. ఈ నాలుగు అబ్జర్వేటరీలను అంతరిక్షంలోకి పంపినప్పుడు.. ఖచ్చితమైన 3D మిశ్రమ నమూనాను పొందుతాం. అప్పుడు ఈ భూమికి ఏం జరుగుతోందన్నది తెలుసుకోవచ్చు. ఈ భూ మండలాన్ని మేము కాపాడాలని అనుకుంటున్నాం’’ అని నెల్సన్ చెప్పుకొచ్చారు. ఈ నాలుగింటిలో NISAR చాలా గొప్పదని.. ఇది నీరు, భూమి, మంచులో ఏవైనా మార్పులు చోటు చేసుకుంటున్నాయా? అనే విషయాల్ని గమనిస్తుందన్నారు. భూమికి ఏం జరుగుతోందో అర్థం చేసుకోవడానికి ఈ డేటా ఎంతో సహాయపడుతుందని అన్నారు.

కాగా.. NISAR అనేది నాసా, ఇస్రో కలిసి చేపబడుతున్న ఉమ్మడి భూమి-పరిశీలన మిషన్. భూమి అటవీ, వెట్‌ల్యాండ్ పర్యావరణ వ్యవస్థల్లోనే మార్పులు గ్లోబల్ కార్బన్ సైకిల్, వాతావరణ మార్పులను ఎలా ప్రభావితం చేస్తున్నాయో అన్వేషించడానికి ఇది పరిశోధకులకు సహాయం చేస్తుంది. వచ్చే ఏడాది మొదటి భాగంలో ఈ మిషన్‌ని చేపట్టనున్నట్టు బిల్ నెల్సన్ తెలిపారు. ఇండియన్ స్పేస్ ఏజెన్సీ రాకెట్‌ని అందించిందని, ఆ తర్వాత సంయుక్తంగా అంతరిక్ష నౌకను తయారు చేశామని ఆయన అన్నారు. ఇది బెంగళూరులోని ఇస్రో వద్ద సిద్ధమవుతోందని వివరించారు.

Updated Date - 2023-12-02T09:01:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising