ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nasal vaccine : కరోనాకు ముక్కు టీకా ఇన్‌కొవాక్‌ వచ్చె

ABN, First Publish Date - 2023-01-27T03:00:28+05:30

కరోనా నివారణకు భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారుచేసిన ముక్కు టీకా ‘ఇన్‌కొవాక్‌’ను కేంద్రమంత్రులు మాండవీయ, జితేంద్ర సింగ్‌ గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీలో ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌

కొవిడ్‌కు ప్రపంచంలోనే తొలి ఇంట్రానాజల్‌ వ్యాక్సిన్‌

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి

న్యూఢిల్లీ, జనవరి 26: కరోనా నివారణకు భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారుచేసిన ముక్కు టీకా ‘ఇన్‌కొవాక్‌’ను కేంద్రమంత్రులు మాండవీయ, జితేంద్ర సింగ్‌ గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. మాండవీయ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, సంస్థ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్లా పాల్గొన్నారు. కరోనాకు ఇది ప్రపంచంలోనే ముక్కు ద్వారా వేసే తొలి టీకా కావడం, దీన్ని హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేయడం విశేషం. దీన్ని 18 ఏళ్లు దాటినవారికి బూస్టర్‌ డోసుగా ఇచ్చేందుకు గతేడాది నవంబరులో డీసీజీఐ అనుమతి ఇచ్చింది. కాగా ప్రాథమిక డోసులుగా, బూస్టర్‌ డోసుగా వినియోగించేందుకు వీలుగా ఇన్‌కొవాక్‌ను జాతికి అంకితం చేసినట్టు భారత్‌ బయోటెక్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రైవేటు ఆస్పత్రులకు ఒక డోసు ధర రూ.800కు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.325కు అందిస్తామని తెలిపింది.

Updated Date - 2023-01-27T03:00:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising