ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాత్‌రూంలో కుప్పకూలిన సత్యేందర్‌

ABN, First Publish Date - 2023-05-26T04:16:33+05:30

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నాయకుడు, ఢిల్లీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిహాడ్‌ జైలులో తెల్లవారుజామున 6 గంటలకు ఘటన

ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి ఐసీయూలో ఆక్సిజన్‌ సపోర్ట్‌పై చికిత్స

న్యూఢిల్లీ, మే 25: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నాయకుడు, ఢిల్లీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మనీ ల్యాండరింగ్‌ కేసులో అరెస్టయి.. తిహాడ్‌ జైలులో ఉన్న ఆయన గురువారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో బాత్‌రూంలో పడిపోయారు. దీంతో జైన్‌ను గదికి తరలించి వైద్యులు పరిశీలించారు. వారి సూచన మేరకు తొలుత దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ (ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆయన ఐసీయూలో ఆక్సిజన్‌ మద్దతుతో చికిత్స పొందుతున్నారు. తనకు వెన్నెముక, ఎడమ కాలు, భుజం నొప్పి ఉందని జైన్‌ వైద్యులకు తెలిపారు. ఢిల్లీ మాజీ మంత్రి ఏడాదిగా తిహాడ్‌ జైలులోని సెల్‌ నం.7లో అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉంటున్నారు. గత సోమవారం వెన్నెముక సమస్యతో అస్వస్ధతకు గురవడంతో సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ సందర్భంగా శారీరకంగా బాగా నీరసించినట్లు కనిపిస్తున్న ఫొటోలను ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ బయటపెట్టారు. జైన్‌ 35 కిలోల బరువు తగ్గినట్లు పేర్కొన్నారు. బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో ఆయన తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు చెప్పారు. కాగా, జైన్‌ ఆరోగ్యంపై ఆందోళన వెలిబుచ్చిన ఆప్‌ వర్గాలు.. ఆయన్ను హతమార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని గతంలో ఆరోపించాయి. వీటిని బీజేపీ తిప్పికొట్టింది. అరెస్టుకు ముందు జైన్‌ అధిక బరువుతో బాధపడేవారని, మతాచారాలకు తగ్గట్లు రోజుకు ఒక్క పూటనే భోజనం చేస్తుండడంతో బరువు తగ్గి చూడ్డానికి చక్కగా కనిపిస్తున్నారని వ్యంగ్యంగా స్పందించింది.

Updated Date - 2023-05-26T04:16:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising