ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NCRB: డ్రైవింగ్‌లో నిద్ర వస్తే..

ABN, First Publish Date - 2023-01-01T03:01:00+05:30

చాలా వరకు రోడ్లు ప్రమాదాలు అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల మధ్య చోటుచేసుకుంటున్నాయని జాతీయ నేరాల నమోదు విభాగం(ఎన్‌సీఆర్బీ) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. డ్రైవర్లు కునికిపాట్లుపడడం.. మగతగా ఉండడమే..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డ్రైవింగ్‌లో నిద్ర వస్తే అప్రమత్తం చేసే మగత హెచ్చరిక వ్యవస్థ

అమలుకు ఆలోచన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

ఇప్పటికే నిపుణుల కమిటీ నివేదిక సిద్ధం!

15 రాష్ట్రాల్లో 25% ప్రమాదాలు నిద్ర వల్లే

న్యూఢిల్లీ, డిసెంబరు 31: చాలా వరకు రోడ్లు ప్రమాదాలు అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల మధ్య చోటుచేసుకుంటున్నాయని జాతీయ నేరాల నమోదు విభాగం(ఎన్‌సీఆర్బీ) (National Crime Records Bureau)నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. డ్రైవర్లు కునికిపాట్లుపడడం.. మగతగా ఉండడమే..! కేంద్ర రవాణా శాఖ ఇటీవల 15 రాష్ట్రాల్లో నిర్వహించిన ఓ సర్వేలో 25% రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల కునికిపాట్లు, మగత కారణంగా తేలింది. వాహనం వేగం ఎక్కువగా ఉన్నప్పుడు, డ్రైవర్‌ కునికిపాట్లతో తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశాలున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో బస్సులు, లారీలు, కార్లలో డ్రైవర్లు కునికిపాట్లుపడితే.. వెంటనే అప్రమత్తం చేసే వ్యవస్థలను వాహనాల్లో ఇన్‌స్టాల్‌ చేసుకునేలా కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఓ నిపుణుల కమిటీ ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌(ఏఐఎ్‌స)పై కేంద్రానికి ఒక నివేదిక సమర్పించింది. ఇప్పటి వరకు డ్రౌజీనెస్‌ అలెర్ట్‌ సిస్టం పేరుతో అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో ఇలాంటి వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఈ వ్యవసల్లో కొన్ని స్టీరింగ్‌ ప్యాటర్న్‌ను బట్టి డ్రైవర్‌ మగతగా ఉన్నాడని గుర్తించి, బిగ్గరగా వాయిస్‌ మెసేజ్‌ ఇస్తాయి మరికొన్ని డ్రైవర్‌ కళ్లు, ముఖం, రోడ్డుపై లేన్‌ మార్పిడి వంటి అంశాలను గుర్తించి, అప్రమత్తం చేస్తాయి.

వేగం పెంపునకు రంగం సిద్ధం!

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పలు సందర్భాల్లో హైవేలు, ఎక్స్‌ప్రెస్‌ వేలలో వాహనాల వేగాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌ వేలలో గరిష్ఠంగా గంటకు 120 కిలోమీటర్ల వేగాన్ని అనుమతిస్తుండగా.. పెరిగిన వనరులు, ఇంజన్‌ సామర్థ్యం వంటి అంశాల నేపథ్యంలో దాన్ని 140 కిలోమీటర్లకు పెంచుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం శుక్రవారం 9 మంది నిపుణులతో ఓ కమిటీని నియమించింది. వేర్వేరు రహదారుల్లో వాహనాల వేగంపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. కాగా.. 2018లో నిర్ణయించిన మేరకు కార్లకు ఎక్స్‌ప్రెస్‌ వేలలో గంటకు 120 కి.మీ., హైవేల్లో 100 కి.మీ., ఇతర రహదారుల్లో 70కి.మీ. చొప్పున గరిష్ఠ వేగాన్ని నిర్ణయించారు. స్థానిక సంస్థలు, రాష్ట్రాలు వీటిల్లో మార్పులు చేసుకున్నాయి. నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత, కేంద్రం వాహనాల వేగాన్ని పెంచడంపై ఓ నిర్ణయం తీసుకోనుంది.

Updated Date - 2023-01-01T13:07:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising