కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంలోని ఈ ప్రత్యేకతల గురించి తెలుసా?

ABN, First Publish Date - 2023-09-18T19:28:13+05:30

ఈరోజుతో పాత పార్లమెంట్ భవనం సేవలు ముగిశాయి. రేపటి (మంగళవారం) నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. భారత చట్ట సభ్యులు రేపు పార్లమెంట్ మారబోతున్నారు. ఈ నేపథ్యంలోనే..

New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంలోని ఈ ప్రత్యేకతల గురించి తెలుసా?

ఈరోజుతో పాత పార్లమెంట్ భవనం సేవలు ముగిశాయి. రేపటి (మంగళవారం) నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. భారత చట్ట సభ్యులు రేపు పార్లమెంట్ మారబోతున్నారు. ఈ నేపథ్యంలోనే.. కొత్త పార్లమెంట్‌లోని కొన్ని ప్రత్యేకతల గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఎంపీల ప్రసంగాల కోసం కేటాయించబడిన మైక్రోఫోన్‌లకు ఒక ప్రత్యేక సిస్టమ్ ఉందని తెలిసింది. ఎంపీలకు ప్రసంగం కోసం కేటాయించిన సమయం ముగిసిన వెంటనే.. వారి మైక్రోఫోన్స్ ఆఫ్ అయ్యేలా ఆటోమెటెడ్ సిస్టమ్ అమర్చినట్టు తెలుస్తోంది.


ఈ ఆటోమెటెడ్ సిస్టమ్‌ను తీసుకురావడానికి ఒక ప్రధాన కారణం ఉంది. తమ ప్రసంగాలు పూర్తి కాకముందే.. ప్రభుత్వాలు మైక్రోఫోన్‌లను ఆపేసి, తమ గొంతును నొక్కేస్తుందని ప్రతిపక్ష ఎంపీల నుంచి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా.. గత నెలలో అదానీ గ్రూప్ ఆర్థిక తప్పిదాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ హిండెన్‌బర్గ్ సమర్పించిన నివేదికపై విచారణ జరపాలని ప్రతిపక్షం డిమాండ్ చేసినప్పుడు.. తమ మైక్‌లను మధ్యలోనే ఆపేసి, తమ వాణి వినిపించకుండా చేసిందని ఆరోపణలొచ్చాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ విషయంపై మాట్లాడుతూ.. మాట్లాడనివ్వకుండా ప్రభుత్వం మైక్ కట్ చేసి, తనని అవమానించిందని ఆరోపించారు. అయితే.. బీజేపీ మాత్రం ‘సాంకేతిక లోపం’ అని పేర్కొంటూ.. ఆయన ఆరోపణల్ని ఖండించింది. రాహుల్ గాంధీ కూడా లండన్ పర్యటనలో.. ప్రతిపక్ష నాయకుల మైక్రోఫోన్‌లు సరిగ్గా పని చేయడం లేదని పేర్కొన్నారు. అందుకే.. అలాంటివి తిరిగి రిపీట్ అవ్వకూడదని ఆటోమెటెడ్ సిస్టమ్‌ని తీసుకొచ్చారు.

కేవలం ఇదొక్కటే కాదు.. ఈ కొత్త భవనంలో ఇంకా మరిన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయని సమాచారం. సాధారణంగా.. కొందరు సభ్యులు తమ ఆవేశం కోల్పోయినప్పుడు వెల్‌లోకి దూసుకొచ్చి, నిరసనలు తెలుపుతుంటారు. అయితే.. కొత్త భవనంలో అందుకు వీలు లేకుండా బాగా కుదించేశారు. బయోమెట్రిక్ వ్యవస్థని సైతం ఏర్పాటు చేశారు. ఈ కొత్త భవనంలో ఇకపై పేపర్‌లెస్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. అంటే.. ఇకపై పేపర్ల అవసరం లేకుండా ప్రతీ ఎంపీకి ఒక ప్రత్యేకమైన టాబ్లెట్ కంప్యూటర్‌ని ఇస్తారు. ఇక జర్నలిస్టుల కోసం కఠినమైన ప్రవేశ నిబంధనలూ ఉంటాయి. ఈ పార్లమెంట్‌లో మరో ఆకర్షణీయ విషయం ఏమిటంటే.. ఆరు ద్వారాలు. వీటికి గజ, అశ్వ, గరుడ, మకర, శార్దూల, హంస అనే పేర్లు కేటాయించారు. వీటి గుమ్మాలు కూడా చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.

Updated Date - 2023-09-18T19:28:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising