ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Karni sena Sukhadev murder: కర్ణిసేన చీఫ్ హత్యకేసు ఎన్ఐఏకు అప్పగింత

ABN, Publish Date - Dec 19 , 2023 | 09:09 PM

రాజస్థాన్‌లోని జైపూర్‌లో సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది హత్య కేసును ఎన్ఐఏకు అప్పగించినట్టు కేంద్ర హోం శాఖ మంగళవారంనాడు ప్రకటించింది. ఈ నేరంలో గ్యాంగ్‌స్టర్ల ప్రమేయం ఉన్నందున కేసు మొత్తం యాంటీ టెర్రర్ ప్రోబ్ ఏజెన్సీ ఎన్ఐఏకు అప్పగించినట్టు తెలిపింది.

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లోని జైపూర్‌లో సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది (Sukhdev Singh Gogamedi) హత్య కేసును ఎన్ఐఏ (NIA)కు అప్పగించినట్టు కేంద్ర హోం శాఖ (MHA) మంగళవారంనాడు ప్రకటించింది. ఈ నేరంలో గ్యాంగ్‌స్టర్ల ప్రమేయం ఉన్నందున కేసు మొత్తం యాంటీ టెర్రర్ ప్రోబ్ ఏజెన్సీ ఎన్ఐఏకు అప్పగించినట్టు తెలిపింది.


రాజస్థాన్‌లోని జైపూర్‌లో డిసెంబర్ 5న గోగమేది నివాసంలో ఈ హత్య జరిగింది. ఆయనతో మాట్లాడుతూనే ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరపడంతో గోగమేది అక్కడికక్కడే మరణించారు. ఈ కాల్పుల్లోనే ముగ్గురు గన్‌మెన్లలో ఒకడు హతమయ్యాడు. కాల్పులకు పాల్పడిన షూటర్లు రోహిత్, నితిన్ ఫౌజీలను రాజస్థాన్, ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో పట్టుబడ్డారు. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఛండీగఢ్‌లోని ఓ హోటల్‌లో వీరు పట్టుబడ్డారు. షూటర్లు ఇద్దరికీ సహకరించిన మరొకరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోగమేది హత్యానంతరం ఆ హత్య చేసింది తామేనంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధమున్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ప్రకటించడం మరింత సంచలనమైంది.

Updated Date - Dec 19 , 2023 | 09:09 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising