ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Elections: నన్నెవరూ సంప్రదించలేదు: కుమారస్వామి

ABN, First Publish Date - 2023-05-13T11:04:51+05:30

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలే వస్తాయని తాము ఆశిస్తున్నామని, ప్రభుత్వం ఏర్పాటు వ్యవహారంపై ఇంకా ఎవరూ సంప్రదించలేదని జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Karnataka Elections Counting) ఓవైపు జరుగుతుండగా, మరోవైపు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయనున్నారు? మెజారిటీ మార్క్ ఎవరిని వరించనుంది? హంగ్ ఏర్పడితే జేడీఎస్ ఎవరి వైపు మొగ్గుచూపుతుంది? అనే ప్రశ్నలు సైతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాగా, మంచి ఫలితాలే వస్తాయని తాము ఆశిస్తున్నామని, ప్రభుత్వం ఏర్పాటు వ్యవహారంపై ఇంకా ఎవరూ సంప్రదించలేదని జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దీనికి ముందు, బెంగళూరులోని ఓ ఆలయాన్ని కుమారస్వామి దర్శించి పూజలు నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్‌కు చేరువ వరకూ వస్తుందని, జేడీఎస్ 30 నుంచి 32 సీట్లు సీట్లు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంపై మాట్లాడుతూ, తమది చిన్న పార్టీ అని, తనకు అంతగా డిమాండ్ ఉండకపోవచ్చని, మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆశిస్తున్నానని చెప్పారు. ఫలితాలు వచ్చాక మరోసారి మాట్లాడుకోవచ్చని అన్నారు.

కాగా, శనివారం ఉదయం 11 గంటల వరకూ వెలువడిన ట్రెండ్స్ ప్రకారం, కాంగ్రెస్ 116 స్థానాలు, బీజేపీ 71 స్థానాలు, జేడీఎస్ 32 స్థానాలు, ఇతరులు 6 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు. మరోవైపు, కర్ణాటకలో కాంగ్రెస్ విజయం దిశగా పయనిస్తుండటంతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది.

Updated Date - 2023-05-13T11:04:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising